Double Ismart: తెలుగు సినిమా పరిశ్రమలో ఇండస్ట్రీలో సినిమాలు ఈ విధంగా తీస్తేనే హిట్ అవుతాయని చెప్పి మరి సినిమాలు చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్. తక్కువ సమయంలోనే బ్లాక్బస్టర్ హిట్ చిత్రం చేసిన పూరీ ఇటీవల కాలంలో హిట్టు కొట్టడానికి ఎంతగానో ఇబ్బంది పడుతున్నాడని చెప్పాలి. ఆయన గత పది సినిమాలను పరిశీలిస్తే కేవలం ఇస్మార్ట్ శంకర్ సినిమా మాత్రమే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుందని చెప్పాలి. మిగతా సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచినవే. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు చేస్తున్న డబల్ ఇస్మార్ట్ సినిమాపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.
no buzz of puri jagannadh ismart shankar
ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా రావడం ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటించిన వంటి అంశాలు మంచి అంచనాలు ఏర్పడడానికి కారణం అయ్యాయి. అయితే ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టినప్పటికీ అవి ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోవడంతో ఈ సినిమాపై బస్ అంతగా ఏర్పడలేదు అనేది కొంతమంది ట్రేడ్ పండితుల ఆలోచన. మంచి డైరెక్టర్ పెద్ద ప్రొడ్యూసర్ భారీ హీరో బాలీవుడ్ లో పేరు ఉన్న నటుడు ఉన్న కూడా ఈ సినిమాకు మినిమం బజ్ కూడా లేకపోవడం పూరి జగన్నాథ్ టేకింగ్ పట్ల ప్రేక్షకులకు నమ్మకం పోయిందని చెబుతుంది.
Also Read: Raayan: పవన్ భజన.. రాయన్ కి ఉపయోగపడేనా?
ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమా వస్తుంది అంటే హీరో ఎవరు అనేది పట్టించుకోకుండా ఆయన సినిమాలకు వెళ్లేవారు. అలాంటిది ఇప్పుడు పూరీ జగన్నాథ్ అవుట్ డేటెడ్ సబ్జెక్టుల వల్ల ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారని ఆయన గమనించడం లేదేమో. మరి ఇన్ని నెగిటివ్ అంశాల మధ్య ప్రేక్షకులు ముందుకు రాబోతున్న రామ్ హీరోగా నటించిన డబల్ ఇస్మార్ట్ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందా అనేది చూడాలి. పూరి జగన్నాథ్ కెరియర్ను ఇస్మార్ట్ శంకర్ సినిమా నిలబట్టితే మళ్ళీ ఆ సినిమాకి సీక్వెల్ అయిన డబల్ ఈ స్మార్ట్ సినిమా నిలబెట్టాల్సిన సమయం వచ్చింది. పూరీ జగన్నాథ్ గత సినిమా లైగర్ ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద చేతికిలబడింది.