Mega star Vishwambhara Movie release in December

Mega Heroes: టాలీవుడ్ సినిమా పరిశ్రమలో డజన్ మంది మెగా వారసులు ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఉన్నారు. అరడజను మంది హీరోలైతే మిగతావారు నటులుగా స్థిరపడిపోయారు. ఆ విధంగా మెగా హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మంచి విజయాలు సాధిస్తూ చిరంజీవి వేసిన బాటలో సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకువెళ్తున్నారు. ఆ విధంగా ఈ ఏడాది మెగా హీరోల సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా.

Mega star Vishwambhara Movie release in December

పుష్ప మొదటి భాగం ఎంతటి పెద్ద సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా యొక్క రెండవ భాగంపై అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా డిసెంబర్లో విడుదల కావడం అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు మరింత నిరాశపరిచింది కూడా ఆగస్టులో వస్తుందని చెప్పిన చిత్ర బృందం అనూహ్యంగా ఈ సినిమాను డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేసింది. ఇకపోతే ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాలని రామ్ చరణ్ కూడా సిద్ధమవుతున్నాడు. ఆయన శంకర్ దర్శకత్వంలో చేసిన గేమ్ ఛేంజర్ సినిమాను ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు.

Also Read: Jagan: జగన్ కోసం రంగంలోకి రాహుల్ గాంధీ..?

ఇటీవల ఈ చిత్రం యొక్క నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను పేక్షకులు ముందుకు తీసుకు రాబోతున్నామని తెలిపింది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాని కూడా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా యొక్క షూటింగ్ జరగకుండా జరుపుకుంటుంది. వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా భారీ అంచనాల మధ్య ఈ సినిమా తెరకెక్కుతుంది.

త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఇప్పటికే 50% షూటింగ్ పూర్తయింది అని అంటున్నారు చిరంజీవి నటించిన అంజి సినిమా తరహాలోనే భారీ విజువల్ ఎఫెక్ట్స్ తరహాలో ఈ చిత్రం ఉండబోతుంది అనేది అందరూ చెబుతున్న మాట. మరి చాలా రోజులుగా చిరంజీవికి విజయం దక్కని నేపథ్యంలో ఈ సినిమా ఆయనకు మంచి విజయాన్ని తెచ్చి పడుతుందా అనేది చూడాలి. ఆ విధంగా ఈ ముగ్గురు మెగా హీరోలు కూడా డిసెంబర్ నెలను టార్గెట్ చేయడం ఇప్పుడు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆసక్తి పరుస్తుంది. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.