Jai Balayya Reference in Allu Shirish Movie

Jai Balayya: సీనియర్ హీరోల క్రేజ్ ను కొంతమంది యువ హీరోలు క్యాష్ చేసుకుంటూ ఉంటారు. వారి తాలూకు క్రేజ్ను తమ సినిమాలలో ఉపయోగించుకొని ఆ సినిమాకు ఆయా ఫ్యాన్స్ యొక్క సపోర్టును అందిపుచ్చుకుంటూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ వంటి హీరోల క్రేజ్ను చాలామంది యువ హీరోలు వాడుకొని తమ సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చటంలో ఇప్పటిదాకా చాలామంది సఫలం అయ్యారు. ఆ విధంగా నందమూరి బాలకృష్ణ క్రేజ్ను వాడుకోవడంలో ఒక ఫ్యామిలీ మాత్రం డిట్ట అనే చెప్పాలి.

Jai Balayya Reference in Allu Shirish Movie

నందమూరి బాలకృష్ణ అల్లు వారి ఫ్యామిలీకి ఎంతో దగ్గరయ్యారు. వారి ఓటీతీ సంస్థ అయినా ఆహాలో ఒక షో చేసిన దగ్గర నుంచి బాలకృష్ణ అల్లువారి ఫ్యామిలీకి ఇంకా ఇంకా దగ్గరయ్యారు. అంతేకాదు ఆ నిర్మాణ సంస్థలో ఒక సినిమా చేయడానికి కూడా వారు ముందుకు వస్తున్నారు త్వరలోనే వీరి కాంబినేషన్లో ఒక సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సినిమాలకు గీతా ఆర్ట్స్ సంస్థలో వచ్చే సినిమాలుకు బాలకృష్ణను ముఖ్య అతిథిగా పిలిచి ఆ ఫంక్షన్ ఎంతో అట్రాక్టివ్ గా జరిగే విధంగా బాలకృష్ణ క్రేజ్ ను వాడుకున్నారు.

Also Read: Heroine: శ్రీ లీల తలదన్నే అందం.. సినిమాలే.. సినిమాలు!!

అలాగే ఇప్పుడు అల్లు శిరీష్ కూడా బాలకృష్ణ క్రేజ్ ను తన సినిమాలో ఉపయోగించుకోబోతున్నాడు. ఆయన ఫ్యాన్సును అలరించబోతున్నారు. ఆయన తాజాగా నటిస్తున్న ‘బడ్డీ’ అని సినిమాలో బాలకృష్ణను బాగానే వాడుకున్నారట. ఆయన క్రేజ్ కు తగ్గట్లుగా ఆయన డైలాగులు చెబుతూ ఆయన ప్రస్తావన తీసుకువస్తూ ఈ సినిమాను ముందుకు తీసుకు వెళుతున్నారట. మరి బాలకృష్ణ అభిమానులు ఈ జోడింపును ఏ విధంగా తీసుకుంటారో చూడాలి.

ఇక అల్లు శిరీష్ కు గత కొన్ని సినిమాలుగా సక్సెస్ లు దొరకడం లేదు అల్లు అర్జున్ లాంటి హీరో తమ్ముడుగా ఉండి కనీసం హిట్లు కూడా అందుకోకపోవడం నిజంగా ఆయనకు పెద్ద తలవొంపులే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎన్నో అంచనాల నడుమ ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ఈ సినిమా ఆయనతో మంచి విజయాన్ని చేకూరుస్తుందా అనేది చూడాలి ఇప్పటికే విడుదలైన అప్డేట్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.