Pan world Star Prabhas Movies in Pan India Wide

Prabhas: ప్రభాస్.. ఇండియాలో ఈ పేరు తెలియని వారు ఉండరు. బాహుబలి సినిమా ఆయనకు గొప్ప పేరు ప్రఖ్యాతలను తీసుకువస్తే, ఆ తర్వాత చేసిన సినిమాలు ఆయన్ని ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్లేలా చేశాయి. దేశంలో ప్రతి ఒక్క ప్రాంతంలో ఇప్పుడు ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు అంటే పెద్ద అతిశయోక్తి కాదు. ముఖ్యంగా నార్త్ లో ఈ హీరోకి అభిమానులు చాలానే పెరిగిపోయారు. ఎంతగా అంటే నార్త్ లో పెద్ద హీరోలుగా పేరు ఉన్న ఖాన్ త్రయం లను మించి పోయే రేంజ్ లో ఆయనకు అభిమానులు ఉన్నారు.

Pan world Star Prabhas Movies in Pan India Wide

దానికి నిదర్శనమే ఆయన తాజాగా చేసిన కల్కి సినిమా యొక్క కలెక్షన్లు. ఈ సినిమాకు సౌత్ తో పాటు నార్త్ లో కూడా మంచి కలెక్షన్లు వచ్చాయని చెప్పాలి. వెయ్యి కోట్లు దాటిన ఈ సినిమా యొక్క రన్ ఇంకా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్లను అందుకుంటుందో పూర్తి రన్ అయ్యేంతవరకు చెప్పలేము. ఏదేమైనా నార్త్ లో రోజురోజుకీ ప్రభాస్ యొక్క రేంజ్ పెరిగిపోతుందని చెప్పాలి.

Also Read: Allu Arjun Vs Ram Charan: అదే జరిగితే.. బావ బామ్మర్దుల మధ్య భారీ యుద్ధమే!!

బాలీవుడ్ లో ప్రభాస్ చేసిన సినిమాలు ప్రతి ఒక్కటి కూడా అక్కడ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎలాంటి పాత్ర చేసిన ఆయనకు బ్రహ్మ రథం పడుతున్నారు. బాలీవుడ్ హీరోల కంటే ఎక్కువగా ప్రభాస్ నే అభిమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ నార్త్ అభిమన్లను దృష్టిలో ఉంచుకుని సినిమాలు చేయాలని కొంతమంది సూచిస్తున్నారు. ఇక ఆయన ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం సలార్ సినిమాకు రెండవ భాగాన్ని చేసే పనిలో ఉన్న ప్రభాస్ ఇప్పుడు మరొక కొత్త సినిమాను కూడా మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే సినిమా చేస్తూ ఉండగానే కల్కి రెండవ భాగం సినిమాను కూడా ఆయన చేయబోతున్నాడు. ఇక సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమా ఉండనే ఉంది. ఆ విధంగా చాలా ఫ్యాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూ ఫ్యాన్ ఇండియా స్టార్ గా కాకుండా పాన్ వరల్డ్ స్టార్ గా ఆయన ఎదగడం విశేషం.