Trivikram Movie Not started untill

Trivikram: టాలీవుడ్ చిత్రంలో దర్శకుడు త్రివిక్రమ్ కు ఒక ప్రత్యేక శైలి ఉంది. ఆయన సినిమాలు కుటుంబ పేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. కుటుంబ విలువలు, ప్రేమలో ఆప్యాయతలు ఆయన సినిమాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలా ఆయనతో సినిమాలు చేసిన హీరోలు భారీ విజయాలను అందుకోగా ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి హీరోలు సముఖంగా లేరనే వార్తలు బయటకి పొక్కుతున్నాయి.

Trivikram Movie Not started untill

వాస్తవానికి ఆయన సినిమా విడుదలయ్యి చాలా రోజులైంది. మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతికి విడుదల కాగా ఇప్పటిదాకా ఆయన ఏ చిత్రాన్ని కూడా మొదలు పెట్టలేదు. దానికి గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడక పోవడం ఒక కారణమైతే హీరోలు త్రివిక్రమ్ ఎక్కువగా నమ్మడం లేదు అనేది ఇన్సైడ్ గా వినిపిస్తున్న మరో కారణం. ఏదేమైనా త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఇంకా మొదలు పెట్టకపోవడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది.

Also Read: Mega Heroes: మెగా హీరోలందరి కన్ను దాని వైపు.. మెగా స్టార్ కూడా!!

వాస్తవానికి గుంటూరు కారం సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేయవలసి ఉంది. కానీ అల్లు అర్జున్ ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈయన సినిమా మరింత ఆలస్యం అవుతుంది. దానికి తోడు అసలు త్రివిక్రమ్ సినిమా ఉండదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప రెండో భాగం సినిమా చేస్తూ ఉండగా ఆ తర్వాత అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఆ విధంగా అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తే మాత్రం త్రివిక్రమ్ సినిమా దాదాపు క్యాన్సల్ అయినట్లే అని చెప్పాలి. ఒకవేళ ఆ సినిమా చేయకపోతే మాత్రం త్రివిక్రమ్ సినిమా ఉంటుంది అది కూడా సంవత్సరం తర్వాతే అని అంటున్నారు. ఎందుకంటే సుకుమార్ పుష్ప మూడవ భాగం సినిమా కూడా చేయబోతున్నారని అంటున్నారు. మరి వేరే ఒక హీరోతో త్రివిక్రమ్ సినిమాను మొదలు పెడతారా అనేది చూడాలి.