No Update From Akkineni Akhil New Movie

Akhil: స్టార్ హీరోలా వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు అనగానే వారి అభిమానులలో ఎన్నో అంచనాలు నెలకొంటాయి. తండ్రి యొక్క వారసత్వాన్ని నిలబెట్టే వారసుడిగా అందరూ సదరు హీరోను సపోర్ట్ చేస్తూ ఉంటారు.తద్వారా వారు స్టార్ హీరో లు గా నిలబడతారు. అయితే కొన్నిసార్లు ఇది వర్కౌట్ కాదు. చాలామంది ఆ విధంగా వచ్చి తమలోని సత్తాను చూపించలేక మధ్యలోనే ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ విధంగా మరొక హీరో అవ్వకూడదు అని ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

No Update From Akkineni Akhil New Movie

అక్కినేని కుటుంబం నుంచి మూడవ తరం నటుడుగా వచ్చిన అఖిల్ సక్సెస్ ల విషయంలో చాలా వెనుకబడి ఉన్నాడు. మొదటి సినిమాతోనే భారీ స్థాయిలో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడే కానీ పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించడంలో విఫలం కాగా నాలుగవ సినిమాగా వచ్చిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ పరవాలేదనిపించుకుంది. ఆ తర్వాత చేసిన ఏజెంట్ సినిమా భారీ ఫ్లాప్ ను మూటకట్టుకోగా దాని ద్వారా అఖిల్ ఇమేజ్ కి భారీ నష్టమే మిగిల్చిందని చెప్పాలి.

Also Read: Prabhas: ఇకపై ప్రభాస్ ను అలా పిలవద్దేమో!!

ఇక ఆ చిత్రం వచ్చి ఏడాది దాటి పోయినా కూడా అఖిల్ తదుపరి సినిమా గురించి ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అక్కినేని అఖిల్ ఇలాంటి అప్డేట్ ఇవ్వకుండా ఇలా సైలెంట్ గా ఉండడం అక్కినేని అభిమానులను ఎంతగానో కంగారు పెట్టిస్తుంది. ఓ భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వచ్చినా కూడా ఇంతవరకు దానికి సంబంధించిన వివరాలు ఏవి బయటకు ప్రకటించడం లేదు. అఖిల్ తదుపరి సినిమా విషయంలో ఏం జరుగుతుంది అనేది అర్థం కాకపోవడంతో అక్కినేని అభిమానులు ఏం చేయాలో పాలు పోవడం లేదు.

నాగర్జున ఈ విషయమై కొంత కలుగజేసుకొని వెంటనే అఖిల్ కెరియర్ ను సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వారు చెబుతున్నారు. సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఆయన ఓ మ్యారేజ్ ఫంక్షన్ లో కనిపించిన లుక్ మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుండగా ఆ లుక్కుని బట్టి ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారని మాత్రం తెలుస్తుంది. కాబోయే స్టార్ హీరో ఈ విధంగా గ్యాప్ తీసుకోవడం ఆయన కెరియర్ కు ఏ మాత్రం మంచిది కాదని సినిమా పండితులు చెబుతున్న మాట.