Mega Prince varun tej movie lineup

Varun Tej: వరుస ఫ్లాప్ లతో సతమతమవుతూ ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం క్రేజీ లైనప్ ను ఏర్పాటు చేసుకున్నాడని చెప్పాలి. ఆయన నటించిన గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, గని వంటి చిత్రాలు ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో కథల ఎంపికలో వరుణ్ తేజ్ ఆచితూచి వెళ్లాలని ఆయన అభిమానులు అభిప్రాయపడ్డారు. ఇప్పటి తరం ప్రేక్షకులకు అర్థమయ్యే కథలను నచ్చే సినిమాలను చేసి వారిని ఆకట్టుకోవాలని సన్నిహితులు చెప్పారు.

Mega Prince varun tej movie lineup

ఆ విధంగానే పాన్ ఇండియా అప్పీల్ ఉన్న యాక్షన్ కథలను చేయడానికి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపించారు. అందుకే కరుణ కుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ అనే సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగా చేస్తున్నారు. మాఫియా కథాంశంతో పిరియాడికల్ జోనర్ గా ఈ మూవీ తెరకెక్కుతూ ఉండగా ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా యొక్క షూటింగ్ జరుగుతుంది. ఇకపోతే ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతుంది అని చెబుతున్నారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఆమె గ్లామర్ ఈ చిత్రానికి బాగా ఉపయోగపడుతుంది అని అందరూ భావిస్తున్నారు.

Also Read: IPL 2025: ముంబైకి గుడ్ బై…రోహిత్ కు 100 కోట్ల ఆఫర్ ?

ఇక మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి పచ్చ జెండా ఊపారట వరుణ్ తేజ్. కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక టచ్ చేసి చూడు దర్శకుడైన విక్రమ్ సిరికొండ చెప్పిన ఓ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ కి కూడా వరుణ్ తేజ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తుంది. ఆ విధంగా ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులతో వరుణ్ తేజ్ కెరియర్ మరింత ముందుకు వెళుతుందని భావించవచ్చు. మట్కా సినిమా షూటింగ్ పూర్తికాగానే ఈ రెండు సినిమాలను వచ్చే ఏడాదిలో మొదలుపెట్టి పార్లర్ గా షూటింగులు చేయబోతున్నాడట.