Kalki 2898 AD second part director nag ashwin

Kalki 2898 AD: కల్కి సినిమా ఎంతటి స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. 1500 కోట్లకు పరుగులు తీస్తున్న ఈ చిత్రం విడుదలయ్యి నెలరోజులు అవుతున్నా కూడా థియేటర్లకు ప్రేక్షకులు వెళుతూనే ఉన్నారు. తెలుగులో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. ఇక నార్త్ అమెరికాలో కూడా బాహుబలి రికార్డులను అన్నిటిని అధిగమించి నెంబర్ వన్ స్థాయికి ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్ అందుకున్న చిత్రంగా కల్కి నిలవగా హిందీలో కూడా అక్కడి స్టార్ హీరోలను తలదన్నే విధంగా కలెక్షన్లను అందుకుంది.

Kalki 2898 AD second part director nag ashwin

ఇక ఈ సినిమా యొక్క రెండవ భాగం కోసం ఇప్పుడు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొదటి భాగం పెద్ద హిట్ అవ్వడంతో రెండో భాగంపై కూడా అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. అయితే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే మొదలు పెట్టడానికి నాగ్ అశ్విన్ ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉండగా కొన్ని సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేయాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం డేట్ల సమస్య ఈ దర్శకుడికి ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవైపు దీపిక గర్భవతిగా ఉంది. ఇంకొక వైపు ప్రభాస్ వరుస సినిమాలో చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరి అణువైన సమయాన్ని చూసుకొని షూటింగ్ స్టార్ట్ చేయాలని నాగ అశ్విన్ భావిస్తున్నాడు.

Also Read: Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడా?

అన్ని కరెక్ట్ గా జరిగితే ఈ ఏడాది ఆఖరిలో ఈ సినిమాను మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూసేలా చేసిన రెండవ భాగాన్నీ ఏ విధంగా తెరకెక్కిస్తారో చూడాలి. ఈ సినిమా లో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటింకాహ్గా కమల్ హాసన్ విలన్ గా అదరగొట్టబోతున్నాడు. రెండవ భాగంలో ఆయన పూర్తి స్థాయిలో కనిపించబోతున్నాడు.