Anushka: అనుష్క శెట్టి.. 40 ఏళ్లు దాటిన పెళ్లి చేసుకోవడం లేదే అనే ఒకే ఒక్క నిరాశ తప్ప అభిమానుల్లో ఈమె గురించి ఎలాంటి నిరాశ ఉండదు. అనుష్క శెట్టి ఏ సినిమాలో నటించినా సరే ఆ సినిమా బాగా లేకపోయినా అనుష్క పాత్రకి,ఆమె పర్ఫామెన్స్ కి,ఆమె నటనకి చాలా మంది ఫీదా అయిపోతారు.అలా ఎంతో మంది అభిమానులను అనుష్క సంపాదించుకుంది. హిట్స్,ప్లాపులతో సంబంధం లేకుండా లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న అనుష్క ఒక విషయంలో మాత్రం అభిమానులను తెగ ఇబ్బందికి గురిచేస్తుంది అదేంటంటే ఆమె పెళ్లి విషయం.
Anushka ready to marry a handsome boy
ఇప్పటికే అనుష్క పెళ్లి గురించి పలుమార్లు వార్తలు వచ్చినా కూడా అందులో ఎలాంటి నిజం లేదు అని కొట్టి పారేస్తున్నారు. అయితే ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు తీసుకువస్తున్నా కూడా అనుష్క మాత్రం పెళ్లికి రెడీగా లేనట్టు వార్తలు వినిపించాయి.అయితే ఇదంతా ప్రభాస్ కోసమేనని,ప్రభాస్ కోసమే ఆమె వెయిట్ చేస్తుందనే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవ్వడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలాసార్లు ప్రభాస్ అనుష్క పెళ్లి వార్తలు వినిపించాయి. (Anushka)
Also Read: Nagarjuna: ఆ హీరోయిన్ తో రొమా**.. వణికిపోయిన నాగార్జున.. కారణం.?
అయితే ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండడం వల్లే ఇలా పెళ్లిని వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది.ఇక ప్రభాస్ పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తే అనుష్క ఇంట్లో వాళ్లకు సమాధానం చెప్పలేక ఎంత ఇబ్బంది పడుతుందని ఇప్పటికే కొంత మంది నెటిజన్స్ ఫన్నీగా వీరి గురించి మాట్లాడుకుంటారు. అయితే తాజాగా ప్రభాస్ ఇన్ని రోజులు వెయిట్ చేయించడం అనుష్క పేరెంట్స్ కి ఇష్టం లేక ఆమెకు పెళ్లి చేయాలని చూస్తున్నారట.
ఇక ప్రభాస్ అంటే అబ్బాయి కాబట్టి 60 ఏళ్ల వయసులో చేసుకున్న అడిగే వారు ఎవరూ ఉండరు. కానీ అనుష్క అమ్మాయి..పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే సరే కానీ పెళ్లి చేసుకుంటాను అని చెబుతుంది.అందుకే కుటుంబ సభ్యులు అనుష్క కోసం అందమైన సంబంధం తెచ్చారట.కేవలం అందం మాత్రమే కాదు ఆస్తి అంతస్తులు అన్ని ఉన్నాయట. ఒక యువ వ్యాపారవేత్తని అనుష్క శెట్టి పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మరి అనుష్క శెట్టి పెళ్లి వార్తల్లో ఎంత నిజముందో చూడాలి.(Anushka)