Shankar Focus on Indian 3 not on Game Changer

Game Changer: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే సినిమాకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఈ సినిమాను మొదలుపెట్టిన కొద్ది రోజులకే శంకర్ తన గత చిత్రం ఆగిపోయిన సినిమాను పూర్తి చేసి రావాల్సిన అవసరం ఏర్పడడంతో ఆ చిత్రాన్ని పూర్తిచేసి విడుదల చేసిన తర్వాత గేమ్ చేజర్ సినిమా పనులలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయడానికి రంగం సిద్ధం అవుతున్నట్లుగా చిత్ర బృందం ఓ ప్రకటన విడుదల చేసింది.

Shankar Focus on Indian 3 not on Game Changer

క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నెలలోనే పుష్ప రెండో భాగం సినిమా కూడా ఉండడంతో అదే నెలలో ఈ సినిమాను కూడా విడుదల చేయడం అవసరమా అని కొంతమంది చెబుతున్నారు. సౌత్ లో క్రిస్మస్ కు పెద్ద సినిమాలేవి లేకపోవడంతోనే గేమ్ చేంజెస్ సినిమా వస్తుంది అని చెబుతున్నారు. హిందీలో పలు సినిమాలు ఉన్నాయి. అమీర్ ఖాన్ ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇదిలా ఉంటే నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి భారీ స్థాయిలో ఖర్చుపెట్టిన నేపథ్యంలో దాన్ని ఎలా తిరిగి రప్పించుకుంటాడు అనేది ఇక్కడ అసలు విషయం. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి కీలక పాత్రలో కనిపించబోతుంది.

Also Read: Varun Tej: క్రేజీ సినిమాలను లైన్ లో పెట్టిన మెగా ప్రిన్స్!!

అయితే ఈ సినిమా విడుదల సమయానికి షూటింగ్ అవుతుందో లేదో అన్న టెన్షన్లో అందరూ ఉంటే శంకర్ భారతీయుడు మూడవ భాగం సినిమా యొక్క షూటింగ్ కోసం కొన్ని రోజులు వెళతాడట. ఇది మెగా అభిమానులను ఎంతగానో నిరాశపరిచే విషయం. మరి గేమ్ ఛేంజర్ సినిమాకు భారతీయుడు పెద్ద విలన్ లా మారడం మెగా అభిమానులను మరింత కోపానికి గురిచేస్తుంది. పలుమార్లు ఇప్పటికే విడుదల తేదీ విషయంలో మార్పులు జరగగా ఈసారి ఈ సినిమాను వాయిదా అసలు వేయొద్దు అని అభిమానులు కోరుతున్నారు.