Prabhas Hanu raghavapoodi Movie Plannings

Prabhas: ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటించే చిత్రాలు ఎక్కువగానే ఉన్నాయి. అవన్నీ కూడా భారీ స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలే కావడం విశేషం. ఇటీవల కల్కి సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న ప్రభాస్ ఇప్పుడు తన తదుపరి చిత్రాల పట్ల ఫోకస్ పెడుతున్నాడు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజాసాబ్ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి చేశాడు. ఇప్పుడు సలార్ రెండవ భాగం సినిమాను చేస్తున్న ప్రభాస్ ఆ తర్వాత స్పిరిట్, కల్కి రెండవ భాగం సినిమాలను చేయవలసి ఉంది. అంతేకాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమాను కూడా లైన్ లో పెట్టాడట.

Prabhas Hanu raghavapoodi Movie Plannings

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా కోసం దర్శకుడు హను రాఘవపూడి భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒక పిరియాడిక్ వార్ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కపోతుంది. ఏదేమైనా హను రాఘవపూడి ప్రభాస్ సినిమా కోసం ప్లాన్ చేస్తున్న విషయాలను చూస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎంతో ఆనందం కలుగుతుంది అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం ఓ పాకిస్తానీ నటిని హీరోయిన్ గా ఎంపిక చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. అంతేకాదు టెక్నీషియన్స్ ను కూడా హాలీవుడ్ నుంచి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: Chiranjeevi: ఆ ప్లాప్ దర్శకుడికే మళ్ళీ ఛాన్స్ ఇస్తున్న మెగా స్టార్!!

ఈ నేపథ్యంలో ఇంతటి భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న హను రాఘవపూడి ఏ స్థాయిలో విజయం అందుకుంటాడో చూడాలి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనికంటే ముందు నాలుగు సినిమాలు చేయాల్సిన నేపథ్యంలో ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోయే సినిమాకి కూడా భారీ స్థాయిలో ప్లానింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్థాయికి చేరిన ప్రభాస్ సినిమా అంటే ఈ మాత్రం ఉండాలి అని ఆయన అభిమానులు చెప్పకు వస్తున్నారు.