Prabhas love in teacher

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ నిజంగానే టీచర్ తో ప్రేమలో పడ్డారా.. ఇదే నిజమైతే ఎన్నో రోజుల నుండి వేచి చూస్తున్నా అనుష్కకి షాక్ తగిలినట్టే..మరి ఇంతకీ ప్రభాస్ ప్రేమిస్తున్న ఆ టీచరమ్మ ఎవరు? ఇంతకీ ఆమెని ఎక్కడ కలిశారు అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రభాస్ కి చాలా సిగ్గు మొహమాటం తో ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.ఆయన స్టేజి మీద మాట్లాడానికి కూడా కాస్త మొహమాట పడతారు. అయితే అలాంటి ఈయన ఓ టీచరమ్మ ప్రేమలో పడ్డారు అంటే చాలామంది షాక్ అయిపోతారు.

Prabhas love in teacher

అయితే ప్రభాస్ ఓ టీచర్ ని నిజంగానే ప్రేమించారట.ముఖ్యంగా ఆయన ఫస్ట్ క్రష్ ఆమెనే నట.అయితే ఆమె పేరు కూడా తెలియదట.. మరి ఇదంతా ఈ ఏజ్ లో అనుకుంటే పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే ఆయన స్కూల్ డేస్ లో ఉన్న సమయంలో ఓ టీచర్ తో తొలిచూపులోనే ప్రేమలో పడ్డారట .ఆ టీచర్ ని చూడగానే ప్రభాస్ మొహంలో ఒక వెలుగు వెలిగి పోయేదట. అయితే ఈ విషయాన్ని ఓ తమిళ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ చెప్పుకొచ్చారు. (Prabhas)

Also Read: Prabhas: ప్రభాస్ కొత్త సినిమా ఫౌజీ కు భారీ హంగులు!!

ఇక ఈ విషయం చెప్పేటప్పుడు ప్రభాస్ ఫేస్ లో ఎగ్జైటింగ్ చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది. మీ ఫస్ట్ క్రష్ ఎవరు అని ఆ ఇంటర్వ్యూ చేసే యాంకర్ అడగగా..నా ఫస్ట్ క్రష్ స్కూల్ డేస్ లోనే..అది కూడా నా టీచర్.. కానీ ఇప్పుడు ఆమె పేరు మర్చిపోయాను.ఇక చెన్నైలోనే నా స్కూల్ డేస్ గడిచిపోయాయి.అలా స్కూల్ డేస్ లో చదువుతున్న రోజుల్లోనే ఆ టీచర్ నాకు ఫస్ట్ క్రష్ అంటూ ప్రభాస్ చెప్పారు.

Prabhas love in teacher

దీంతో ఈ విషయం విన్న చాలా మంది జనాలు ఫన్నీగా రియాక్ట్ అవుతూ ప్రభాస్ పోయి పోయి పంతులమ్మను ప్రేమించారా..ఇదెక్కడి షాక్ రా నాయనా అంటూ కామెంట్లు పెడుతున్నారు.అయితే ప్రభాస్ ఈ మాటలు ఇప్పుడు మాట్లాడినవైతే కావు గతంలో మాట్లాడిన ఓల్డ్ వీడియో.. ప్రస్తుతం యూట్యూబ్లో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియో మరోసారి నెట్టీంట్లో వైరల్ గా మారింది.(Prabhas)