Did Chiranjeevi become millioner because of that hero

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి వేల కోట్ల ఆస్తులు ఉంటాయి. కానీ ఆస్తులన్నింటికీ కారణం ఓ హీరోనట.ఆ హీరో వల్లే ఆయన ప్రస్తుతం కోటీశ్వరుడు గా మారాడని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఎవరో చెప్పింది కాదు చిరంజీవే స్వయంగా బయటపెట్టారు. మరి ఇంతకీ చిరంజీవిని కోటీశ్వరుడు చేసిన ఆ హీరో ఎవరు.. ఎవరి మాటలు పట్టుకుని చిరంజీవి అంతలా ఎదిగారు అనేది ఇప్పుడు చూద్దాం..

Did Chiranjeevi become millioner because of that hero

మెగాస్టార్ చిరంజీవి దాదాపు రెండు దశాబ్దాలు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలారు. అయితే అలాంటి ఈ హీరో తన రెమ్యూనరేషన్ తో ఎక్కువగా ఆస్తులు కొని కోటీశ్వరుడు అయ్యారట. మరి ఇంతకీ తన కి వచ్చిన డబ్బులని ఎలా ఖర్చు పెట్టారు ఎలా పొదుపు చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. చిరంజీవి ఆస్తులు సంపాదించుకొని కోటీశ్వరుడు అవ్వడానికి కారణం సీనియర్ ఎన్టీఆర్.. (Chiranjeevi)

Also Read: Heroine: రెండోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. అమ్మడు వెరీ ఫాస్ట్..!

అయితే ఓ సమయంలో ఎన్టీఆర్ తో కలిసి చిరంజీవి బజ్జీలు తింటున్న సమయంలో బ్రదర్ మీకు ఇండస్ట్రీలో నేమ్, ఫేమ్ రెండు వస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్నారు.ఈ టైం లో మీకు వచ్చిన డబ్బులను ఇనుప ముక్కల మీద ఇన్వెస్ట్ చేయకుండా స్థలాలు, భూములు వంటివి కొని మంచి ఇల్లు కట్టుకోండి. మనల్ని భవిష్యత్తులో అవే కాపాడతాయి. మన ఫ్యామిలీకి అవే రక్ష అని చెప్పారట.

 Did Chiranjeevi become millioner because of that hero

ఇక ఆరోజు సీనియర్ ఎన్టీఆర్ మాటలను చెవిన పెట్టుకున్న చిరంజీవి అప్పటినుండి తనకు వచ్చిడబ్బులను కార్లు, బైకులు వంటివి కొని వృధా ఖర్చులు చేయకుండా ఇల్లు, పొలాలు, స్థలాలు వంటి వాటిపైన ఇన్వెస్ట్ చేసి ప్రస్తుతం కోటీశ్వరుడు అయ్యారట. ఇక దీనంతటికి కారణం ఆరోజు ఎన్టీఆర్ చెప్పిన మాటలే అంటూ చిరంజీవి ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు.(Chiranjeevi)