Allu Arjun: వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో వరలక్ష్మీ శరత్ కుమార్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రనే ఆమె చేసింది. అయితే, సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది.

Photos of Varalakshmi Sarath Kumar in Allu Arjun’s house

ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్ దేవ్ ను ఆమె వివాహం చేసుకునుంది. ఇప్పటికే వారి ఎంగేజ్మెంట్ కూడా జరిగిన విషయం తెలిసింది.పెళ్లి సమయం దగ్గర పడుతుండటంతో తన గున్ని హితులతో పాటు సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలోని చాలామంది ప్రముఖులను తన వివాహానికి రావాలంటూ వరలక్ష్మి ఆహ్వానిస్తుంది.

Also Read: Namrata: పాపం ఆ పని చేయాల్సిన నమ్రత..కానీ వారికి భయపడి మహేష్ భార్యగా సెటిల్ అయ్యిందా.?

ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్, సమంత, రవితేజ, ప్రశాంత్ వర్మ, తమన్, గోపీచంద్ మలినేని వంటి స్టార్స్ కు వెడ్డింగ్ కార్డ్స్ అందజేసి ప్రత్యేకంగా ఆహ్వానించింది. అయితే తాజాగా తనకు కాబోయే భర్త నికోలాయ్ సచేదేవ్ తో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి వరలక్ష్మి చేరుకుంది. తమ వివాహానికి రావాలని అయన్ను ప్రత్యేకంగా ఆహ్వానించింది.

Photos of Varalakshmi Sarath Kumar in Allu Arjun's house

అదే సమయంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు తమ ఆహ్వాన పత్రికను అందించింది. ఆ సమయంలో బన్నీతో వారు ఫోటోలు దిగారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. వరలక్ష్మి, నికోలాయ్ సచ దేవ ల వివాహం జూలై 2న థాయ్ ల్యాండ్ లో జరుగునున్నట్లు సమాచారం.(Allu Arjun)