Secret of Thamanna Physic Deit and workout

Thamanna: హీరోయిన్ లు తమ ఫిజిక్ కాపాడుకోవడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అందులోనూ టాప్ హీరోయిన్ లు ఎప్పటికప్పుడు తమ అందాలను కాపాడుకునే విధంగా వర్క్ అవుట్లను చేయాలి. లేదంటే వారికి సినిమా అవకాశాలు దూరం అవుతాయి. అంతేకాదు వారిని అభిమానులు కూడా పెద్దగా ఫాలో అవరు. ఆ విధంగా తమన్నా ఎన్నో రోజులుగా తన ఫిజిక్కు కాపాడుకుంటూ సినిమా అవకాశాలను అందుకుంటూ కెరీర్ లో ఎల్లప్పుడూ బిజీ గా ఉంటూ ముందుకు వెళుతుంది.

Secret of Thamanna Physic Deit and workout

దశాబ్ద కాలం దాటిన కూడా తమన్నాకు తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు హీరోయిన్ గా చేసి స్టార్ హీరోల అభిమానుల ఆదరణ అందుకున్న తమన్నా ఆ విధంగా వచ్చిన క్రేజ్ తో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించింది. అవి ఆమెకు మంచి మైలేజీని తీసుకువచ్చాయని చెప్పాలి. మంచి కలెక్షన్లు రావడంతో ఎక్కువ మంది దర్శకని నిర్మాతలు ఆమెతో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపారు. స్టార్ హీరోలు మాత్రం ఆమెకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు. కానీ ఏ ఇండస్ట్రీలో అయినా కూడా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళింది తమన్నా.

Also Read: Chiranjeevi: ఆ హీరో వల్లే చిరంజీవి కోటేశ్వరుడయ్యాడా..?

ఇకపోతే తాజాగా ఆమె తన ఫిట్నెస్ డైట్ ఫార్ములా ని బయటకు వెల్లడించింది. తన ఫిజిక్ ఒకే రకంగా మెయింటెన్ అవడానికి కారణం ఏంటో తెలియజేసింది. తాను ఆకలి వేస్తే ఆకలి తీరే దాకా తింటానని చెప్పింది. కాకపోతే తిన్నంత వర్కౌట్ తప్పకుండా చేస్తానని చెప్పింది. క్యాలరీస్ బాగా కరిగిస్తానని, ఎక్కువగా శాఖాహారం తీసుకుంటానని ఆమె వెల్లడించింది. ఆ విధంగా తమన్న తన ఫిజిక్ ను ఎలా మైంటైన్ చేస్తుందో ఏ విధంగా వర్కౌట్ చేస్తుందో చెప్పకనే చెప్పింది.

తమన్నా ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఇటీవల ‘బాకు’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది. హారర్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇకపోతే ప్రస్తుతం కోలీవుడ్ లో కొన్ని సినిమాలను చేస్తుంటే తెలుగులో కూడా పలు సినిమాలలో నటిస్తుంది. ఒక ఇండస్ట్రీ అనే కాకుండా పలు రకాల ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేస్తూ ఇప్పటికీ బిజీగా ఉంది తమన్నా. ఇలానే ఫిజిక్ మైంటైన్ చేస్తే మాత్రం తమన్నా మరికొన్ని సంవత్సరాలు సినిమాల్లో నటిస్తుందని చెప్పాలి.