Janhvi Kapoor Fires on Media

Janhvi Kapoor: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఉన్న జాన్వీ కపూర్ ఇటీవల ఓ ఫోటోగ్రాఫర్ పై ఫైర్ అయ్యింది. దానికి కారణం తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ ఫోటోగ్రాఫర్ చేసింది తప్పే అంటారు. చాలా రోజుల నుంచి బాలీవుడ్ లో ఓ ట్రెండ్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. సెలబ్రిటీలు జిమ్ లో కానీ ఎయిర్ పోర్ట్ లో కానీ ఏదైనా పబ్లిక్ ప్లేస్ కి గాని వెళితే అక్కడికి ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్ లు వచ్చి వారిని కవర్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా చాలా సార్లు జాన్వీ కపూర్ నుంచి దగ్గర వస్తున్న, వెళ్తున్న వీడియోలు, ఫోటోలు తీసి వాటిని వైరల్ చేసేస్తుంటారు.

Janhvi Kapoor Fires on Media

అయితే ఓ ఫోటోగ్రాఫర్ మాత్రం జాన్వీ వెనుక నుంచి ఫోటో తీయడంతో ఆమెకు ఏమాత్రం నచ్చలేదట. టైట్ డ్రెస్ లు, పార్టీ వేర్ లు వేసుకున్నప్పుడు అలా ఫోటోలు తీస్తే ఆమెకు నచ్చదట. ఆవిధంగా ఆమె సదరు ఫోటోగ్రాఫర్ కి పలుమార్లు చెప్పిన కూడా సదురు ఫోటోగ్రాఫర్లు ఎవరూ అదే పట్టించుకోకుండా ఆమెను ఎటు నుంచి పడితే అటు నుంచి ఫోటోలు వీడియోలు తీసేవారు. దాంతో ఆమెకు కోపం వచ్చిందో ఏమో ఓసారి తనను వెనుక నుంచి ఫోటో తీస్తున్న ఫోటోగ్రాఫర్ పై మండిపడింది. దాంతో సదరు ఫోటోగ్రాఫర్ జాన్వి ఇలా అనడం పట్ల చాలా ఫీలయ్యాడట.

Also Read: Thamanna: తమన్నా అందాలకు ఎంత కష్టం.. ఫిజిక్ అలాంటిది మరీ..!!

ఏదేమైనా సెలబ్రిటీల ప్రైవసీని అడ్డుకోవడం మాత్రం నేరమని చెప్పాలి. వారికి ఇష్టం లేని పనులను చేయడం మంచిది కాదని చెప్పాలి. ఆ విధంగా జాన్వీ కపూర్ చేసిన ఈ నిర్ణయాన్ని సమర్థించే వారు ఉంటే మరి కొంతమంది విమర్శించే వారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆమధ్య ఓ హీరోయిన్ డబ్బులు ఇచ్చి మరి సెలబ్రిటీలు ఈ విధంగా పీఆర్ చేయించుకుంటారని వెల్లడించింది. దాంతో బాలీవుడ్ లో ఈ సంస్కృతి ఎప్పటినుంచి మొదలైంది అని అప్పట్లో అందరూ అనుకున్నారు.

ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకుంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన ‘దేవర’ అనే సినిమాలో చేస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే రామ్ చరణ్ సరసన కూడా ఓ సినిమాను చేయనుంది బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలో చేస్తుంది. ఇప్పుడు తెలుగులో మూడవ సినిమా అవకాశాన్ని అందుకోబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.