Senior Heroes war on Sankranthi Season

Tollywood: 2025వ సంవత్సరం సంక్రాంతి పండుగకు భారీ స్థాయిలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోవడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలయ్యి 50 శాతం పూర్తి చేసుకోగా మిగిలిన భాగాన్ని త్వరగా పూర్తిచేసి సంక్రాంతికి విడుదల చేయాలని దర్శక నిర్మాతల ఆలోచన. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా బింబిసారా చిత్రానికి దర్శకత్వం వహించిన వశిష్ట ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Senior Heroes war on Sankranthi Season

ఇక ఈ సినిమాతో పాటు మరొక సీనియర్ హీరో అయిన విక్టరీ వెంకటేష్ కూడా తన సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ సినిమా ఇటీవలే మొదలైంది. దీనికి సంబంధించిన టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. కానీ ఈ చిత్రాన్ని త్వరగా ఫినిష్ చేసి సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు అభిప్రాయపడుతున్నారు. వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా కూడా గత సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే.

Also Read: Hanuman2: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మాములుగా లేదే!!

ఇక వీరిద్దరితో పాటు తన సినిమాని కూడా సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ ఆయన హీరోగా బాబీ దర్శకత్వంలో చేస్తున్న మాస్ మసాలా సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ప్రేక్షకులు ముందుకు వచ్చి వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో పండగ కానుకగా ఈ సినిమాను తీసుకురావడం తప్పకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని వారు భావిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తూ ఉండగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు సీనియర్ హీరోలలో ఎవరు విజయాన్ని అందుకుంటారో ఎవరు పై చేయి చూపిస్తారో చూడాలి. గతంలో కూడా ఈ సీనియర్ హీరోలు సంక్రాంతికి పోటీపడి ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకున్న నేపథ్యంలో ఇప్పుడు వారు ఏ విధమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి. ఈ మూడు మాత్రమే కాకుండా మరో కొన్ని సినిమాలు కూడా సంక్రాంతికి వచ్చే ఆలోచన చేస్తున్నాయి. ఒక సీజన్లో ఎక్కువ సినిమాలు విడుదలయితే సినిమా వారికే నష్టం కాబట్టి సినిమా పెద్దలు ఈ సంక్రాంతి సినిమాల వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.