Nagarjuna As Villain in Rajinikanth Movie

Nagarjuna: అక్కినేని నాగార్జున టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోగా ఉంటూ వరుస మంచి సినిమాలు చేస్తు వచ్చారు కానీ ఇటీవలే కాలంలో ఆయనకు సక్సెస్ పెద్దగా దక్కలేదనే చెప్పాలి. ‘నా సామి రంగ’ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. దాంతో ఆయనకు ఇప్పుడు వెంటనే ఒక భారీ విజయం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన మాత్రమే కాకుండా ధనుష్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన సోలో హీరోగా సినిమా చేసి విజయాన్ని అందుకోవాలని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు.

Nagarjuna As Villain in Rajinikanth Movie

అందుకే కాబోలు ఓ తమిళ దర్శకుడు తో మాస్ యాక్షన్ సినిమా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. సంక్రాంతి కి ఈ సినిమా ను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా యొక్క షూటింగ్ సెప్టెంబర్ లో మొదలు కాబోతుంది. ఇదిలా ఉంటే నాగార్జున ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా లో నాగార్జున విలన్ గా నటించాలని చిత్ర బృందం సంప్రదించిందట. దీనిపై నిర్ణయం తీసుకొని సమాధానం చెబుతానని నాగార్జున చెప్పాడట.

Also Read: Sai Dharam Tej: ఆ హీరోయిన్ తో సాయి ధరమ్ తేజ్ పెళ్లి.. ఆనందంలో మెగా ఫ్యాన్స్!!

ఈ నేపథ్యంలో నాగార్జున ఈ చిత్రంలో విలన్ గా చేస్తే మంచి రోల్ అవుతుంది అని అభిమానులు భావిస్తున్నారు. ఇంకొంతమంది హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సమయంలో విలన్ గా చేయడం కరెక్ట్ కాదని కూడా అంటున్నారు. మరి నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఇక బిగ్ బాస్ లో కూడా హోస్టుగా వ్యవహరిస్తున్నాడు నాగ్. తెలుగులో రాబోతున్న ఎనిమిదో సీజన్ కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు సినిమాలు, అటు షో పనులు చూసుకుంటూ ఆయన ఫుల్ బిజీ గా ఉండబోతున్నాడు. మరి రజినీకాంత్ సినిమా అంటే విలన్ గా చేస్తేనే బాగుంటుంది అని చాలామంది చెబుతున్న నేపథ్యంలో నాగార్జున దాదాపుగా ఎస్ అనే సమాధానం వస్తుందని అంటున్నారు.