Prashanth neel Next Movie is Suspence

Prabhas: వరుస సినిమాలతో బిజీగా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సలార్ 2 సినిమాపై అందరూ ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. అయితే మొన్నటి దాకా ఈ చిత్రం అసలు రూపుదిద్దుకుంటుందో లేదో అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉండగా తాజాగా ఈ సినిమా మొదలు కాబోతుంది అనే వార్తలు బయటకు రావడం అభిమానులను ఎంతగానో సంతోష పెట్టింది. కొన్ని బడ్జెట్ ఇష్యుస్ కారణంగా ఈ సినిమా మొదలవడం లేట్ అయ్యింది.

Prashanth neel Next Movie is Suspence

ప్రశాంత్ నీల్ దర్శకుడిగా ఎలాంటి సినిమాలను తెరకెక్కిస్తాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అభిమానులను ఏర్పరచుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ చిత్రంతో కూడా అదే స్థాయిలో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం యొక్క రెండవ భాగం కోసం చాలా సమయం తీసుకున్న నేపథ్యంలో మరొక సినిమా ప్లాన్ చేశాడట ప్రశాంత్ నీల్. అది కూడా కోలీవుడ్ హీరో అజిత్ తో.. అయనతో ఓ సినిమా చేయడానికి ప్రశాంత్ కలవగా వీరి కాంబినేషన్లో త్వరలోనే సినిమా రాబోతుంది అని అంటున్నారు.

Also Read: Anasuya: ట్రెండింగ్ లో ఉండడానికి అనసూయ నోటికొచ్చినట్లు అంటుందా?

ఇంకొందరైతే అజిత్ ను కలిసింది సలార్ రెండవ భాగం సినిమా కోసమే అని చెబుతున్నారు. మరి కొంతమంది కేజీఎఫ్ మూడో భాగం సినిమాలో రాబోయే ఓ కీలక పాత్ర కోసమే అజిత్ ను సంప్రదించాడని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే లేదా ప్రశాంత్ నీల్ దీనిపై సమాధానం చెప్పవలసిందే. ఇక చూస్తే ప్రశాంత్ చేయవలసిన సినిమాల జాబితా చాలానే ఉంది. సలార్ 2 తో పాటు కేజీఎఫ్ 3 సినిమా చేయవలసి ఉండగా ఇంకొక వైపు ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయవలసి ఉంది. అంతేకాదు రామ్ చరణ్ తో కూడా ఆయన బేటీ అయిన విషయం తెలిసిందే. ఈ హీరోతో కూడా ఓ సినిమా చేయవలసి ఉంది. మరి ప్రశాంత్ నీల్ ఆలోచన ఏ విధంగా ఉంటుందో చూడాలి.

అజిత్ విషయానికి వస్తే ప్రస్తుతం ఓ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్న అజిత్ ఆ తర్వాత తమల దర్శకులతో వలస సినిమాలను ఒప్పుకున్నాడు ప్రశాంతి నిలమ సినిమా చేయవలసి వస్తే వారిని పక్కకు జరిపి మరీ దర్శకుడు తో సినిమా చేయడం దాదాపుగా ఖరారు అనే అంటున్నారు ఆ విధంగా వీరి కలయికలో రాబోతున్న సినిమా ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో తొందరలోనే చూడాలి.