Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో.. రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో చాలామంది ఎమ్మెల్యేలు..కాంగ్రెస్ వైపు వెళ్లారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇంకా మరి కొంతమంది గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. Revanth Reddy
Names of Revanth Reddy for 10 MLAs who joined Congress
కానీ ఎప్పుడైతే.. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు అక్కడికే పులిస్టాప్ పడింది. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు.తాము గులాబీ పార్టీలో ఉంటామని.. ఎలాంటి కేసులకు భయపడేది లేదని చెబుతున్నారు నేతలు. Revanth Reddy
Also Read: Jagan: జగన్ ఢిల్లీ టూర్ గ్రాండ్ సక్సెస్ ఐనట్టేనా?
అయితే అసలు వాస్తవం అది కాదట.గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు…రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చారట. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదట రేవంత్ రెడ్డి. వాళ్లను ఈగల్లా చూస్తున్నారట. చేరికల కంటే ముందు ఇచ్చిన హామీలను, కాంట్రాక్టు డబ్బులను కూడా ఆపేశారట రేవంత్ రెడ్డి. Revanth Reddy
ఓవరాల్ గా ఈ పదిమంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి ఫూల్స్ చేశారని వార్తలు వస్తున్నాయి.అయితే ఈ విషయాన్ని వెంటనే గులాబీ పార్టీలు ఎమ్మెల్యేలకు మొన్న చేరిన ఎమ్మెల్యేలు తెలిపారట. దీంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లాలంటే భయపడి పోతున్నారట. మొన్నటి వరకు పోదామని డిసైడ్ అయిన.. సుధీర్ రెడ్డి అలాగే మల్లారెడ్డి లాంటి ఎమ్మెల్యేలు కూడా వెనక్కి తగ్గారట.దీంతో కెసిఆర్ కాస్త రిలీఫ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. Revanth Reddy