Rohit Sharma: రోహిత్ శర్మను లాస్ట్ సీజన్ లో కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా చేసింది ముంబై ఇండియన్స్ టీమ్. ఈ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నటువంటి రోహిత్ ఈ వేలంలో రోహిత్ ముంబైను వీడడం దాదాపుగా ఖాయమేనన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ లో మోస్ట్ ఫుల్ కెప్టెన్…. 6వేల పరుగుల మైల్డ్ స్టోన్లు అందుకున్న ఆటగాడిగా రోహిత్ శర్మకు మెరుగైన రికార్డు ఉంది. Rohit Sharma
Heroine who wants to write property for Rohit Sharma
ఇలాంటి ఆటగాడిని తమ టీమ్ లో చేర్చుకోవాలని అన్ని టీమ్స్ చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా సరైన కెప్టెన్ లేక సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జేయింట్స్, పంజాబ్ కింగ్స్ ప్రధాన పోటీ దారులుగా ఉన్నాయి. లక్నోకు కేఎల్ రాహుల్ గుడ్ బై చెప్పనున్నారు. ఈ తరుణంలో అతని స్థానంలో ఓపెనర్, కెప్టెన్సీ స్థానాలను భర్తీ చేయడానికి రోహిత్ శర్మ వైపు లక్నో సూపర్ జేయింట్స్ టీమ్ మేనేజ్మెంట్ చూస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రిషబ్ పంత్ ను వదిలేయాలని చూస్తోంది. Rohit Sharma
Also Read: IPL 2025: రాహుల్ ద్రావిడ్, యువరాజ్ లకు కీలక పదవులు ?
రిషబ్ పంత్ ను కొనుగోలు చేయడానికి సీఎస్కే గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు కూడా ఒక మంచి కెప్టెన్ కావాలి. ఇక పంజాబ్ కింగ్స్ గురించి తెలిసిందే. ఏడాదికోసారి కెప్టెన్ ను మారుస్తుంది. గతేడాది శ్యామ్ కరణ్, అంతకుముందు శిఖర్ ధావన్ ఇలా ఎవరు సక్సెస్ఫుల్ కాలేకపోయారు. అందుకే రోహిత్ వైపు పంజాబ్ చూస్తోంది. Rohit Sharma
ఆ మధ్య రోహిత్ ను మీరు తీసుకుంటారా అని ప్రీతి జింటాను రిపోర్టర్లు అడిగితే…. రోహిత్ వేలంలోకి వస్తే మొత్తం తన ఆస్తినే అక్కడ పెట్టి అతడిని కొనుక్కుంటానని ప్రీతి జింటా చెప్పింది. ఇవన్నీ చూస్తుంటే ఈ మూడు టీమ్స్ వేలంలో రోహిత్ శర్మను కొనుగోలు చేయడానికి పెద్ద యుద్దమే చేయనున్నట్లు కనిపిస్తోంది. Rohit Sharma