Ntr devara focus on bollywood

Devara: ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ‘దేవర’ సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మొదటి భాగాన్ని అక్టోబర్లో విడుదల చేస్తుండగా హై టెక్నికల్ వాల్యూస్ తో యాక్షన్ త్రిల్లర్ గా భారీ తారాగణంతో తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు కూడా భాగం కానున్నారని వార్త ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తూ ఉండగా మరికొంతమంది ఉత్తరాది నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Ntr devara focus on bollywood

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని ఓ కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ను ఎంపిక చేస్తున్నాని వార్తలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘యానిమల్’ మూవీలో విలన్ గా నటించి మెప్పించిన బాబీ తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నాడు.అలాగే బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో కూడా నెగిటివ్ రోల్ చేస్తున్న బాబీ ఎన్టీఆర్ చిత్రంలోనూ నటించడానికి రెడీ అవుతున్నాడట.అయితే ఈయన పాత్ర రెండవ భాగంలో కీలకంగా ఉండబోతుందట.

Also Read: Balakrishna: బాలయ్య 50 ఇయర్స్ వేడుకకి ఎన్టీఆర్ వస్తారా.?

పాన్ ఇండియా సినిమాలు రూపొండడం మొదలైన తర్వాత ఇతర భాషల నటీనటులను తీసుకోవడం ముఖ్యం అయిపోయింది. ఎందుకంటే ఒకే భాషకు సంబంధించిన నటీనటులను తీసుకుంటే ఇతర ప్రాంతాల వారు పెద్దగా కనెక్ట్ అవ్వరు. ఇలా అయితే అందరికీ కనెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. అందుకే మన నిర్మాతలు దర్శకులు హీరోలు సైతం ఇతర భాషల నటీనటులు ఎంపిక చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే ఎన్టీఆర్ సినిమాలో ఈ విధంగా ఇతర భాషల నటీనటులను తీసుకోవడం చూస్తుంటే ఈ సినిమా ఎక్కువ బాలీవుడ్ మీదే ఫోకస్ పెట్టినట్లుగా అర్థమవుతుంది. ఏదేమైనా నార్త్ లో ఈ ఎఫెక్ట్ తప్పకుండా కనిపిస్తుంది అని చెప్పాలి. తెలుగు విషయానికి వచ్చేసరికి ఇది కొంత ఇబ్బందిగా మారుతుంది కానీ తప్పకుండా అందరూ కనెక్ట్ అవుతారని అంటున్నారు. మరి వరుస తెలుగు సినిమాలలో ఇతర నటీనటులను తీసుకోవడం పట్ల తెలుగు నటులు ఏమైనా హర్ట్ అవుతారా అనేది చూడాలి.