Mega Hero Vaishnav Tej Next Movie

Mega Hero: ఉప్పెన సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న హీరో వైష్ణవ తేజ్ తెలుగులో మరొక స్టార్ హీరో అవతాడు అని ప్రతి ఒక్కరు కూడా భావించారు. అలా అంతటి స్థాయిలో విజయాన్ని అందుకున్న తర్వాత ఆయన చేసే చిత్రం అదే స్థాయిలో ఉండాలని అందరూ భావించారు కానీ కథల ఎంపికలో సరిగ్గా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఆయనకు వరుసగా మూడు పరాజయాలు దక్కాయి. ఆ విధంగా ఒక మంచి విజయం కోసం ఇప్పుడు ఎదురుచూస్తున్నాడని చెప్పాలి.

Mega Hero Vaishnav Tej Next Movie

‘ఉప్పెన’ సినిమా తరువాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘కొండపల్లి’ అనే సినిమా చేశారు. అది బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో పరాజయం పాలయ్యింది. ఆ తర్వాత ‘రంగ రంగ వైభవంగా’ అనే ఓ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో కూడా నటించారు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా అందరిని తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఫైనల్ గా ఓ ఒక మాస్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని చెప్పి ఆదికేశవ సినిమా చేయగా ఇది డిజాస్టర్ గా మారింది. ఈ విధంగా మూడు ఫెయిల్యూర్స్ వచ్చేసరికి వైష్ణవి సైలెంట్ గా ఉన్నాడు ఇప్పుడు.

Also Read: Devara: ఎన్టీఆర్ “దేవర” ఫోకస్ అంతా దానిపైనే… ఎన్టీఆర్ మారిపోయాడుగా!!

దాంతో మెగా అభిమానులు ఆయన మంచి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ యువ హీరోలు అంతా వరుస చిత్రాలతో బిజీగా ఉంటే చేతిలో ప్రాజెక్ట్ లేక వైష్ణవ్ సైలెంట్ గా ఉండడం అభిమానులకు ఏమాత్రం నచ్చటం లేదు. ఆయన గత సినిమా వచ్చి సంవత్సర కాలం దాటుతున్న ఇంకా తదుపరి సినిమాపై ఎలాంటి క్లారిటీ లేదు. తన సినిమాల విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవడం వల్లనే ఈ ఆలస్యానికి కారణం అవుతుంది అని తెలుస్తుంది. కాస్త లేట్ అయినా సరే మంచి విజయాన్ని అందుకోవాలని అందుకే సినిమాల ఎనౌన్స్ చేసే విషయంలో ఆలస్యం అవుతుందని అంటున్నారు.