Harish Shankar: కొంతమంది దర్శకులు హీరోయిన్ లను చూపించే విధానం చాలా వెరైటీగా ఉంటుంది. ఎవరు చూపించని విధంగా వారిని చూపిస్తూ వారి కెరీర్ లను సెట్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు దర్శకుడు రాఘవేంద్రరావు తన సినిమాలలో నటించే హీరోయిన్ లు స్టార్ హీరోయిన్ లు గా మారేవారు అని ఓ పేరు ఉండేది. ఆ తర్వాత కాలంలో చాలా మంది డైరెక్టర్లు హీరోయిన్ లను సరికొత్త గా చూపిస్తూ వారి కెరియర్లను సెట్ చేసేవారు. ఆ విధంగా ఈ తరంలో హీరోయిన్లను బాగా చూపించి వారికి మరిన్ని సినిమా అవకాశాలు రప్పించే దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు దర్శకుడు హరీష్ శంకర్.
Heroine Bhagyasri Borse next star heroine of tollywood
తన మొదటి సినిమా ‘షాక్’ దగ్గర నుంచి మొన్న చేసిన ‘గద్దల కొండ గణేష్’ సినిమా వరకు ఆయన ఎంతో మంది హీరోయిన్లకు అవకాశాలు ఇచ్చారు. వారందరూ కూడా ఇప్పుడు మంచి సినిమాలతో బిజీగా ఉన్నవారే కావడం విశేషం. రిచా గంగోపాధ్యాయ, శృతిహాసన్, పూజా హెగ్డే వంటి హీరోయిన్లను తీసుకువచ్చి వారు తర్వాత కాలంలో ఎంతో బిజీ అయ్యేలా చేసిన హరీష్ శంకర్ ఇప్పుడు ఓ కొత్త హీరోయిన్ కెరియర్ను కూడా సెట్ చేయబోతున్నాడు అని చెప్పాలి. ఆయన రవితేజ హీరోగా చేస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్ లో భాగ్యశ్రీ బోర్సే అనే ఒక కొత్త అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నాడు.
Also Read: Meenakshi Chaudhary: సినిమాలు చేయాలంటేనే భయంగా ఉందంటున్న బిజీ బ్యూటీ!!
మేకింగ్ దశలోనే ఈ అమ్మాయి యొక్క లుక్స్ గురించి అందరిలో చర్చ జరిగింది. ఆమధ్య ఓ పాట ప్రోమో విడుదల చేయగానే ఆమెకు ఉన్న క్రేజ్ మరింత పెరిగిపోయింది అని చెప్పాలి. ఏదేమైనా భాగ్యశ్రీ అందాలు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసాయి. టాలీవుడ్ కి మరొక ఇలియానా వచ్చింది అని చర్చ కూడా సాగింది. మరి సోషల్ మీడియాలో ఈమె పేరు మారి మోగిపోతున్న నేపథ్యంలో ఆమెకు మరొక సినిమా అవకాశం రావడం ఇప్పుడు ఆసక్తి కలుస్తుంది.
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా సినిమాలో ఈ ముద్దుగుమ్మ ను హీరోయిన్ గా ఎంచుకున్నారట. ముందుగా ఈ సినిమాకు శ్రీలీల ను హీరోయిన్ గా అనుకోగా పలు కారణా లు ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకుంది. పలువురు హీరోయిన్ లను అనుకోగా చివరకు ఆ అవకాశం ఈమెకు వెళ్ళింది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ రెండు సినిమాలు ఆమెకు కలిసి వస్తే మాత్రం తప్పకుండా ఆమె పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.