Pawan Kalyan Pending Movies Problems

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలు పెండింగ్ లో ఉండగానే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎలక్షన్ల కోసం ఆయన వెళ్లిపోయారు. ఆ తర్వాత చాలా మార్పులు జరిగాయి అని చెప్పాలి. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ కూటమి గెలవడం, ఆయన డిప్యూటీ సీఎం గా మారటం వంటివి చక చక జరిగిపోయాయి. పోనీ ఎలక్షన్ల తర్వాతనైనా ఆ సినిమాలు మొదలు పెడతాడు అని అనుకుంటే.. లేదు.. పలు శాఖలకు మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉండడంతో సినిమాల గురించి ఆలోచించే టైమే లేదు అన్నట్లుగా కాలం గడిచిపోతుంది.

Pawan Kalyan Pending Movies Problems

మీటింగ్ లు, పర్యటనలు. చర్చలతోనే పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ముందుకు వెళుతుంది. పవన్ ఒక్క నెల రోజులు డేట్లు ఇస్తే తమ షూటింగ్ పూర్తి చేసుకోవడానికి ఎదురుచూస్తున్నారు సదరు నిర్మాతలు. ఎప్పుడో చాలా రోజుల క్రితం మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా, అలాగే సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమాలు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వాటికి కొన్ని రోజులు డేట్లు ఇవ్వాలని కోరుతున్న కూడా వాటిని పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని బిజీగా గడుపుతున్నాడట.

Also Read: Naga Chaitanya: తండేల్ కి మోక్షం ఎప్పుడో.. ఎందుకు డిసైడ్ కాలేకపోతున్నారు?

పవర్ స్టార్ అభిమానులు కూడా ఈ సినిమాలకు డేట్లు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి ఇంత బిజీ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ ఈ రెండు సినిమాలను ఎప్పుడు పూర్తి చేస్తాడో చూడాలి. ముఖ్యంగా ఒజీ ని కంప్లీట్ చేయాలనీ ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఈ సినిమా యొక్క విడుదలను అక్టోబర్లో చేయాలని భావించారు. కానీ సినిమా షూటింగ్ పెండింగ్ ఉండడంతో విడుదల సమయం కూడా చాలా తక్కువగా ఉండటంతో ఇవన్నీ పనులు అయ్యేలా లేవని నిర్మాతలు ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అది కూడా పవన్ డేట్స్ ఇస్తేనే..

ఇంకొక వైపు హరిహర వీరమల్లు సినిమా నిర్మాత కూడా డిసెంబర్లో సినిమా తేవాలని ప్రయత్నాలు చేయగా అది ఫలించేలా లేదనే చెప్పాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనికరిస్తే ఈ చిత్రం కూడా వేసేవి లోనే విడుదల అవుతుంది. ‘ఓజీ’ కంటే ముందుగానే హరిహర వీరమల్లు మొదలైంది కాబట్టి ఒజీ మరింత ఆలస్యం అవ్వక తప్పదు. ఇవిలా ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా పెండింగ్ లోనే ఉంది. పాలనలో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ ఈ మూడు సినిమాలను పూర్తి చేస్తాడా అనేది ఇంకా డౌట్ గానే ఉంది. ఒకవేళ చేస్తే ఎప్పుడు పూర్తి చేస్తాడో చూడాలి.