Raayan Review: నటీనటులు: ధనుష్, సందీప్ కిషన్, కాళిదాసు జైరాం, అపర్ణ బాలమురళి, ఎస్ జే సూర్య, శరవణన్ తదితరులు.
దర్శకులు: ధనుష్
నిర్మాతలు : సన్ పిక్చర్స్
సంగీత దర్శకుడు: ఏ ఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
ఎడిట‌ర్: ప్రసన్న జీకే
విడుదల తేదీ: 26 జూలై 2024

Dhanush Raayan Movie Review and Rating

Raayan Review: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అంటే తెలియని తెలుగు వారుండరు. తమిళంతో పాటు తెలుగు లో కూడా ఈ హీరో కి మంచి పేరుంది. తాజాగా అయన హీరో గా నటించిన ‘రాయన్’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన కెరీర్‌లో ఇది 50వ సినిమా గా తెరకెక్కిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ శుక్రవారం (జులై 26) గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది అనే విషయం ఈ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ : చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరమైన రాయన్ (ధనుష్)కు ఇద్దరు తమ్ముళ్లు. అందులో ఒకరు ముత్తు వేల్ (సందీప్ కిషన్) కాగా మరొకరు మాణిక్యం (కాళిదాస్ జయరామ్). వీళ్లకు ఓ చెల్లి కూడా ఉంది, ఆమె పేరు దుర్గ (దుషారా విజయన్). ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపే రాయన్ చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని, తమ్ముళ్లకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని కలలు కంటూ ఉంటాడు. రాయన్ ఇలా తన పని తాను చేసుకుంటూ ఉంటే ఒక సందర్భంలో ఆ ఏరియా డాన్ దురై (శరవణన్)ను చంపాల్సి వస్తుంది. ఆ తర్వాత రాయన్ మీద దురై ప్రత్యర్థి సేతు రామన్ (ఎస్.జె. సూర్య) కన్ను పడి తనతో పని చేయమని కోరగా రాయన్ నిరాకరిస్తాడు. అయితే అసలు దురైను రాయన్ ఎందుకు చంపాడు? ఈ క్రమంలో రాయన్, అతని తమ్ముళ్ల మధ్య విబేధాలు ఎందుకు వచ్చాయి? అన్నదమ్ముల గొడవ ఒక వైపు, సేతు రామన్ తో మరో వైపు గొడవలతో రాయన్ ఏం చేశాడు? ఏమైంది? ఈ కథలను పోలీసు అధికారి (ప్రకాష్ రాజ్) ఏ విధమైన మలుపులు తిప్పాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటులు: ధనుష్ మరో ఛాలెంజింగ్ రోల్ చేశాడు. ఎక్కువ డైలాగ్స్ లేకపోయినా యాక్షన్ లో మాత్రం ధనుష్ ఇరగదీశాడు. ప్రతి సన్నివేశంలో ధనుష్ మెప్పించాడు. అయన నటనే ఈ సినిమా కి బలం. ధనుష్ తర్వాత అంతటి స్థాయి లో ప్రేక్షకులను అలరించిన దుషారా విజయన్ వేరే లెవెల్ లో నటించిందని చెప్పాలి. ఆమె పాత్ర ఈ సినిమాకే హైలైట్. ఇక సినిమాలో చేసిన ఎస్ జే సూర్య శరవణన్ లు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటారు. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో అదరగొట్టారు. సూర్య ఆకాశం హద్దురా సినిమా లో హీరోయిన్ గా నటించిన అపర్ణ బాలమురళి ఆకట్టుకుంది. హీరో సందీప్ కి జోడిగా మంచి నటన కనబరిచింది.ఇక వీరితో పాటుగా వరలక్ష్మి శరత్ కుమార్, దివ్య పిళ్ళై తదితరులు తమ రోల్స్ లో ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు: నటుడిగా సినిమాకి పూర్తి న్యాయం చేసాడు ధనుష్ కానీ దర్శకుడిగా ఈసారి తన బెంచ్ మార్క్ సినిమా చేయలేదనే చెప్పాలి. అయితే బోర్ కొట్టించకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేశాడు. పాత్రలకు ఎంపిక చేసిన కాస్టింగ్ బాగుంది. స్క్రిప్ట్ విషయంలో మరింత జాగ్రత్త పడొచ్చు. ఏ ఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ. మునుపెన్నడూ వినని మ్యూజిక్ తో చేసిన ప్రయోగం థియేటర్‌ లో ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రసన్న జీకే ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

ధనుష్

సెకండ్ హాఫ్

రెహమాన్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్

నో ఎమోషన్స్

సాగతీత

తీర్పు: ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పాలి. అయన యాభైయవ సినిమా గా తెరకెక్కిన ఈ చిత్రం లో మెప్పించే అంశాలు కూడా చాలా ఉన్నాయి. కథ రొటీన్ అయినా స్క్రీన్ ప్లే బాగుంది. తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయాల్సిన సినిమా.

రేటింగ్ : 3/5