Renu Desai: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ మొదటి భార్య… రేణు దేశాయ్ కాంగ్రెస్ పార్టీ టచ్ లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖను.. పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయి కలవడంతో… ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. Renu Desai

Pawan Kalyan ex wife Renu Desai meets Minister Konda Surekha in Hyderabad

వాస్తవానికి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కొండా సురేఖను కలవలేదు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖను శుక్రవారం సాయంత్రం కలిశారు సినీ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ తో గంటపాటు చర్చలు చేశారు. పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల పై తెలంగాణ మంత్రి అలాగే రేణు దేశాయ్ చర్చ చర్చించినట్లు సమాచారం. Renu Desai

Also Read: Revanth Reddy: కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి పంగనామాలు?

భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను మంత్రి సురేఖకి వివరించారట రేణు దేశాయ్. అయితే ఈ నేపథ్యంలోనే… రేణు దేశాయికి అన్ని విధాల తెలంగాణ ప్రభుత్వం సహాయం అందిస్తుందని… కొండా సురేఖ వివరించారట. Renu Desai

అయితే వీరిద్దరి సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి రేణు దేశాయ్ వెళుతుందని సోషల్ మీడియాలో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. వైసిపి అయితే పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చి… అతని భార్య కాంగ్రెస్ లోకి వెళుతుందని జోరుగా ప్రచారం చేస్తుంది. కాగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు సంతానం అయిన తర్వాత వారిద్దరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడవ భార్య దగ్గర ఉంటున్నాడు. Renu Desai