Akhil6 sixth movie opening details

Akhil6: అక్కినేని హీరో అఖిల్ హీరోగా నటించే తదుపరి సినిమా కోసం ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆయన గత చిత్రం ‘ఏజెంట్’ విడుదలయి సంవత్సరాల కాలం దాటుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాబోయే ఆరవ సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంత గానో ఎదురుచూస్తున్నారు. యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా త్వరలోనే ఈ చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Akhil6 sixth movie opening details

అనిల్ అనే ఓ నూతన దర్శకుడు తో ఈ చిత్రాన్ని చేయబోతున్నారు. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో అని ఎలాంటి స్థాయిలో నిర్మించబడుతుందో అని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూ ఉండడం ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియకపోవడం వంటివి జరుగుతూ ఉండడంతో అక్కినేని అభిమానులు కాస్త ఫైర్ అవుతున్నారు.

Also Read: Prashanth Neel: రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల నుంచి తప్పుకున్న ప్రశాంత్ నీల్!!

తాజాగా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అన్నదానిపై ఓ క్లారిటీ వచ్చినట్లే అని చెప్పాలి. యూవీ క్రియేషన్స్ వారు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’ అని ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే మొదలయ్యి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా ఈ సినిమా పైనే నిర్మాతలు పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. వారి వద్ద ఉన్న పెట్టుబడి మొత్తాన్ని కూడా ఈ సినిమా పైనే పెట్టారట. ఆ విధంగా ప్రస్తుతం ఈ సినిమా తప్ప మరో సినిమా చేయలేని స్థితిలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఒకవేళ సినిమాను మొదలుపెడితే కనుక సంక్రాంతి తర్వాతనే మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. అఖిల్ టీం కి ఇవే సంకేతాలు వెళ్లేటట్టు నిర్మాతలు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఫైనల్ గా ఈ సినిమా కోసం మేకోవర్ అవడం తప్ప అఖిల్ చేసేదేమీ లేదు. నిర్మాతలు దాదాపుగా ఈ సినిమాను సంక్రాంతి తర్వాతనే చేస్తామని చెప్పేశారు. ‘విశ్వంభర’ పై పెట్టిన డబ్బులు వచ్చిన తర్వాతనే మొదలు పెడతామని క్లియర్ గా చెప్పడంతో అప్పటిదాకా అఖిల్ వెయిట్ చేయక తప్పదు.