Prabhas: పాన్ వరల్డ్ హీరోగా ప్రభాస్ ఎదిగిన తర్వాత వరస పెద్ద సినిమాలలోనే ఆయన నటిస్తారని ప్రతి ఒక్కరు కూడా భావించారు కానీ అనూహ్యంగా ప్రభాస్ గేర్ మార్చడం ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేలా చేస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండవ భాగం సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ తర్వాత చిన్న సినిమాలలో చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు. అందుకే మీడియం రేంజ్ దర్శకులతో సినిమాలు ఒప్పుకుంటున్నాడు.
Why prabhas doing small movies
ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ అనే చిత్రాన్ని చేస్తున్న ప్రభాస్ ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సీతారామం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ దర్శకుడు ప్రభాస్ కోసం ఒక పిరియాడికల్ ప్రేమ కథను రాసాడట. ఆ చిత్రాన్ని చేయడానికి ప్రభాస్ కూడా ఒప్పుకోవడం విశేషం. దీన్నిబట్టి హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలను చేయడం కంటే ఇలాంటి మీడియం రేంజ్ సినిమాలను చేయడానికే ఎక్కువగా ప్రభాస్ ఇష్టపడుతున్నట్లు తెలుస్తుంది. సలార్ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమాను చేయబోతున్నాడు.
Also Read: Akhil6: అఖిల్ కే ఎందుకిలా? ఇంకెన్నాళ్లు వేచి చూడాలో?
ఆ విధంగా ఈ రెండు భారీ యాక్షన్ సినిమాలను చేసిన తర్వాత ప్రభాస్ మీడియం రేంజ్ సినిమాలను ఒప్పుకోవడం అభిమానులను ఒక వైపు సంతోష పెడుతున్న ఇంకొక వైపు కలవర పట్టిస్తుంది. మరి వీటి ద్వారా ప్రభాస్ ఏ స్థాయిలో విజయాలు అందుకుంటాడో చూడాలి. మారుతి తో చేసే ‘రాజా సాబ్’ సినిమా తన తదుపరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. తమన్ సంగీతం సమకూరుస్తుండగా ఈ చిత్రంలో ఐదుగురు ముద్దుగుమ్మలు హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం. హర్రర్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.