Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఏపీ ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చారు. ఎన్నికల కంటే ముందు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ప్రకటించి… అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తడం లేదు నారా చంద్రబాబు నాయుడు. ఈ విషయం మొన్నటి అసెంబ్లీ సమావేశాలలోనే తేలిపోయింది. అచ్చం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్లుగానే ఏపీలో చంద్రబాబు నాయుడు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. Chandrababu

Chandrababu doing like cm revanth reddy

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల కంటే ముందు ప్రకటించారు. దీంతో ఆశపడ్డ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని… రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అంతేకాదు శ్వేత పత్రాలు రిలీజ్ చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని దోషిగా చూపించారు. Chandrababu

Also Read: Renu Desai: పవన్ కళ్యాణ్ కు షాక్.. కాంగ్రెస్ లోకి రేణు దేశాయ్ ?

దీంతో తెలంగాణ అప్పుల పాలు అయిందని… 6 గ్యారంటీ ల ఊసు ఎత్తడం లేదు రేవంత్ రెడ్డి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన గురువు చంద్రబాబు నాయుడు కూడా అలాంటి పనులే చేస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తూ… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల కారణంగా.. ఏపీ ఆగమైందని అంటున్నారు. Chandrababu

ఇక మొన్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన చంద్రబాబు నాయుడు.. అప్పుల వివరాలు చెప్పాడు కానీ… అసలు సూపర్ సిక్స్ కోసం బడ్జెట్ పెట్టలేదు. దీంతో మరో ఏడాది కాలం పాటు… సూపర్ సిక్స్ ఊసు ఎత్తే అవకాశాలు లేనట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. Chandrababu