Star Heroine: ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకుంటున్న సెలబ్రెటీల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కొంతమంది అయితే పెళ్లి అయిన రెండు మూడు గంటలకి రెండు మూడు రోజులకి విడాకులు తీసుకుంటూ అందరిని షాకింగ్ కి గురి చేస్తున్నారు. ఇక సెలబ్రిటీలైతే పెళ్ళై ఏడాది కాకముందే విడాకుల బాట పడుతున్నారు. అయితే అంత సర్దుకున్నప్పుడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాలి. అర్ధం చేసుకోనప్పుడు ఎందుకు పెళ్లి అనే బంధంతో ఒక్కటై దానికి అర్థం లేకుండా చేస్తూ విడిపోవడం అని చాలామంది వీరి విడాకులు వార్తలను చూసి విసిగిపోతున్నారు.కొంతమంది అయితే పెళ్లి అనే బంధానికి ఉన్న పేరే చెడగొడుతున్నారు అని విమర్శిస్తున్నారు.
Star Heroine who is going to get a divorce
అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఓ హీరోయిన్ పెళ్ళై సంవత్సరం కూడా కాకుండానే విడాకులు తీసుకోబోతున్నట్టు నెట్టింట ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు విడాకులు తీసుకోబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా అంటే అందరికీ తెలుసు.అయితే ఈమె.గతేడాది సెప్టెంబర్ లో రాజకీయ నాయకుడు అయినటువంటి ఎంపీ రాఘవ్ చద్దాని ప్రేమ పెళ్లి చేసుకుంది.ఇక వీరి పెళ్లి సమయంలో ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే అలాంటి ఈ జంట పెళ్ళై సంవత్సరం కూడా కాకుండానే విడాకులు తీసుకోబోతున్నట్టు జోరుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దానికి ప్రధాన కారణం పరిణితి చోప్రా పెట్టిన పోస్టు.( Star Heroine)
Also Read: Pawan Kalyan: ఈ పవన్ భజన ఇంకెన్నాళ్లు.. నితిన్ ఫ్యాన్స్ రిక్వెస్ట్!!
ఇక విషయంలోకి వెళ్తే.. పరిణితి చోప్రా తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ బోట్లో ప్రయాణిస్తున్న సమయంలో స్యాడ్ గా ఫేస్ పెట్టి తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ దాని కింద ఒక క్యాప్షన్ పెట్టింది. అందులో ఏముందంటే.. జీవితం చాలా చిన్నది.. ఈ జీవితంలో మీరు మీకోసం బతకండి.కానీ ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచించడం మానేయండి.మీ లైఫ్ లో మీకు నచ్చినట్టు ఉండండి.ఇతరుల కోసం ఆలోచించి మీ లైఫ్ మీరు నాశనం చేసుకోకండి.ఇక ఈ మంత్ లో నేను కొద్ది రోజులు ఆగి ఆలోచన చేశాను. ఇతరులకు ప్రాముఖ్యత ఇవ్వడం మానేసి మీ లైఫ్ మీరు చూసుకోండి.ప్రతిక్షణం ఎంజాయ్ చేయండి. జీవితం మళ్ళీ రాదు. ప్రతి సెకండ్ మీ కోసమే ఆలోచించుకోండి. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించడం మానేయండి.
మీ కోసం మీరు ఆలోచించుకోకుండా ఇతరుల కోసం ఆలోచిస్తే మీ జీవితాన్ని మొత్తం కోల్పోతారు. అలాగే మీ లైఫ్ లో మీరే ఎక్కువగా బాధపడతారు. లైఫ్ లో ఎలా బతకాలి అనుకుంటున్నారో అలాగే బతకండి.ఇతరుల కోసం మీ జీవితాన్ని కేటాయించకండి.మీరు ఎలా జీవించాలి అనుకుంటున్నారో అలాగే జీవించండి. అంటూ ఒక ఆలోచనత్మక పోస్టు పెట్టింది. దీంతో ఈ పోస్ట్ చూసిన చాలా మంది జనాలు అసలు పరిణితి చోప్రా ఏంటి ఇలాంటి పోస్ట్ పెట్టింది. అందులోనూ స్యాడ్ ఫోటో షేర్ చేసింది.భర్తతో ఏమైనా గొడవలు అయ్యాయా.. విడాకులు ఏమైనా తీసుకోబోతున్నారా అంటూ చాలామంది జనాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై పరిణితి ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.( Star Heroine)
https://www.instagram.com/parineetichopra/reel/C92HmtkIS5R/?hl=en