Chiranjeevi new house

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ లోకి వచ్చిన సమయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొని చివరికి అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని పెద్ద స్టార్ అయ్యారు.అయితే అలాంటి ఈయన తనకి వచ్చిన డబ్బులన్ని సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన సలహాను పాటించి ఇల్లు,స్థలాలు కొని ఆస్తిని రెట్టింపు చేసుకున్నారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని ఎన్నో ఆస్తులు కూడబెట్టారు.

Chiranjeevi new house

అయితే అలాంటి చిరంజీవి తాజాగా హైదరాబాదులో జూబ్లీహిల్స్ లో ఒక పెద్ద లగ్జరీ హౌస్ ని నిర్మించుకున్నారు. ఎన్నో సౌకర్యాలతో కూడి ఉన్న ఈ ఇల్లు ధర కోట్లలోనే ఉన్నట్టు తెలుస్తుంది.మరి దాని ధర ఎంత.. ఆ ఇల్లు ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం దగ్గరలో దాదాపు 100 కోట్ల డబ్బులు పెట్టి ఒక లగ్జరీ ఇల్లు స్పెషల్ గా డిజైన్ చేయించుకున్నారట చిరంజీవి.(Chiranjeevi)

Also Read: Nani: అతడిని పక్కనపెట్టిన నాని.. అంత భయం ఎందుకు నేచురల్ స్టార్!!

ఇక ఈ ఇల్లు దాదాపు 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందట. అలాగే అధునాతన సౌకర్యాలతో కూడిన ఈ ఇల్లుని ప్రముఖ డిజైనర్ తరుణ్ తహాలియా డిజైనింగ్ చేసినట్టు తెలుస్తోంది.మొదటి అంతస్తులో విశాలమైన గదులతో పాటు రెండో అంతస్తులో పూజ గది అలాగే స్విమ్మింగ్ పూల్ ని చాలా స్పెషల్గా డిజైన్ చేయించుకున్నారట.

Chiranjeevi new house

ఇక ఈ స్విమ్మింగ్ పూల్ నుండి ఉదయం పూట వచ్చే సూర్యుని అందాలను చాలా అద్భుతంగా వీక్షించవచ్చని తెలుస్తోంది. అలా లగ్జరీగా కట్టుకున్న ఈ ఇల్లు కోసం దాదాపు 100 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి ప్రస్తుతం సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న విశ్వంభర అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్లు అని తెలుస్తోంది.(Chiranjeevi)

https://www.instagram.com/p/B-de_81jdyW/?utm_source=ig_web_copy_link