Allu Arjun true nature is revealed by Chiranjeevi

Allu Arjun: అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య గత కొద్ది రోజులుగా కోల్డ్ వార్ నడుస్తుందనే వార్తలు వినిపించినప్పటికీ ఎప్పటికప్పుడు ఆ రూమర్స్ కి చెక్ పెడుతూ ఉంటారు ఈ రెండు ఫ్యామిలీలు.కానీ రీసెంట్గా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో బన్నీ స్నేహితుడు వైసిపి అభ్యర్థికి సపోర్ట్ చేయడంతో ఈ గొడవలు మళ్ళీ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. అయితే దీనికి తోడు నాగబాబు పెట్టిన పోస్ట్ ఒకటి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయనే దానికి కారణమైంది.

Allu Arjun true nature is revealed by Chiranjeevi

దాంతో మెగా, అల్లు ఫ్యామిలీ ల మధ్య విభేదాలు వచ్చాయని చాలామంది భావిస్తున్నారు. అంతేకాకుండా కిరాక్ ఆర్పి వంటి జబర్దస్త్ కమెడియన్లు కూడా అల్లు అర్జున్ పై విమర్శలు చేస్తున్నారు. కానీ కొంతమంది మెగా, అల్లు ఫ్యామిలీలు రెండు ఒకటేనని,ఎవరిని ట్రోల్ చేయవద్దని, వాళ్ళు ఎప్పటికైనా ఒకే ఫ్యామిలీ అంటూ చెబుతున్నారు.అయితే అల్లు మెగా ఫ్యామిలీ ల మధ్య గొడవలు ఉన్నాయి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో చిరంజీవి అల్లు అర్జున్ గురించి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.(Allu Arjun)

Also Read: Chiranjeevi: ఫలక్ నుమా ప్యాలెస్ ని మించి చిరంజీవి కొత్త ఇల్లు.. ధర ఎంతంటే.?

మరి ఇంతకీ అల్లు అర్జున్ ని చిరంజీవి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.. చిరంజీవి,రామ్ చరణ్ లను నాగబాబు కూతురు నిహారిక ఓసారి ఇంటర్వ్యూ చేసింది.ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవిని కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగింది. అందులో భాగంగా వరుణ్ తేజ్ గురించి అడగగా.. జిరాఫీ అని చెప్పాడు. ఎందుకంటే వరుణ్ తేజ్ జిరాఫీ లాగా మంచి హైట్ ఉంటాడు.అలాగే పవన్ కళ్యాణ్ పేరు చెప్పగా ఇంట్రావర్ట్ అని సమాధానం ఇచ్చాడు.

Allu Arjun true nature is revealed by Chiranjeevi

అలాగే రామ్ చరణ్ కూడా పవన్ కళ్యాణ్ లాగే ఇంట్రావర్ట్ అని ఆన్సర్ ఇచ్చారు. ఇక మరో హీరో అల్లు అర్జున్ పేరు చెప్పగా అల్లు అర్జున్ ప్యాక్ ఆఫ్ ఎనర్జీ అని ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. అంటే బన్నీ లో ఎనర్జీ లెవెల్స్ ఆ రేంజ్ లో ఉంటాయని చిరంజీవి మెచ్చుకున్నారు.. ఇక ఈ ఒక్క మాటతో అల్లు మెగా ఫ్యామిలీల మధ్య ఏమి లేదని, కేవలం బయటి వాళ్లు రూమర్స్ స్ప్రెడ్ చేయడం తప్ప లోపల వీరందరూ ఒక్కటేనని అర్థమవుతుంది.(Allu Arjun)