Girlfriend who can't forget NTR.. What did she do

NTR: ఎన్టీఆర్ ని మర్చిపోలేక పోతున్న ప్రియురాలు అంటే ఇదేదో సినిమా విషయం కాదు.అది రియల్ లైఫ్ లో. ఎన్టీఆర్ తన నిజ జీవితంలో ప్రేమించిన హీరోయిన్ అనగానే అందరికీ బాలీవుడ్ నటి సమీరారెడ్డి మాత్రమే గుర్తుకొస్తుంది. ఈయనతో రెండు సినిమాల్లో నటించిన సమీరా రెడ్డి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని, వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన సమయంలో హరికృష్ణ, ఎన్టీఆర్ కి వార్నింగ్ ఇవ్వడంతో భయపడిపోయిన ఎన్టీఆర్ సమీరారెడ్డికి బ్రేకప్ చెప్పినట్టు వార్తలు వినిపించాయి.

Girlfriend who can’t forget NTR.. What did she do

అంతేకాదు సమీరా రెడ్డికి కూడా వార్నింగ్ ఇవ్వడంతో ఆమె హైదరాబాద్ వదిలేసి ముంబైకి పారిపోయిందనే టాక్ కూడా వినిపించింది.అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి చెప్పారు. అది కేవలం అట్రాక్షన్ మాత్రమే అని కూడా అన్నారు.అయితే అది సమీరారెడ్డిని ఉద్దేశించే చెప్పినట్టు అందరికీ అర్థమైంది. అయితే తాజాగగా సమీరా రెడ్డి ఎన్టీఆర్ పై లవ్ గురించి మాట్లాడిన ఓ ఓల్డ్ వీడియో ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే సమీరారెడ్డి మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్న కొంత మంది జనాలు ఎన్టీఆర్ ని సమీరా ఇంకా మర్చిపోలేక పోతోంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. (NTR)

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ నిజ స్వరూపం ఎలాంటిదో బయట పెట్టిన చిరంజీవి..?

మరి ఇంతకీ ఎన్టీఆర్ గురించి సమీరారెడ్డి ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం. సమీరారెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ నట ప్రస్థానం గురించి మాట్లాడుతూ..ఎన్టీఆర్ ఈ రేంజ్ కి ఎదగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఆర్ఆర్ఆర్ మూవీలో చాలా గొప్ప ప్రదర్శన చేశారు.అందులోని నాటు నాటు పాట నా కూతురు ప్రతిరోజు చూస్తుంది.ఈ పాటంటే నా కూతురికి చాలా ఇష్టం. అలాగే నేను చిరంజీవి,ఎన్టీఆర్ లతో నటించానని మా నాన్న చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఇది నాకు మంచి గుర్తింపునిచ్చే విషయం.

Girlfriend who can't forget NTR.. What did she do

అలాగే ఎన్టీఆర్ తో నటించినందుకు నాకు కూడా సంతోషాన్నిచ్చింది. ఆర్ఆర్ఆర్ మూవీలో నటించిన పాన్ ఇండియా హీరోతో నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకెంతో గర్వకారణం అంటూ అప్పటి రోజులను తలుచుకొని సమీరా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తెగ మురిసిపోయింది. దాంతో ఈమె వీడియో చూసిన కొంత మంది జనాలు పాపం సమీరా ఎన్టీఆర్ ని ఇంకా మర్చిపోలేక పోతుంది కావచ్చు. అందుకే ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పేరు చెప్పగానే చాలా ఎగ్జైట్ అయిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(NTR)