Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి వర్సెస్ తెలుగుదేశం పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతూనే ఉంది. ఒకరి పైన ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… వైసిపి ఫైర్ బ్రాండ్ నేతలపై కేసులు నమోదు కావడం జరుగుతుంది. ఎవరైతే తెలుగుదేశం నేతలను ఇబ్బంది పెట్టారో వారిని… ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. Vangalapudi Anitha
Vangalapudi Anitha resign for AP Home Minister
అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత… ఏపీలో పరిస్థితులు విచిత్రంగా తయారయ్యాయి. లా అండ్ ఆర్డర్ మొత్తం చేతులు దాటేసింది. రోజుకో హత్య అలాగే అత్యాచారం సంఘటనలు జరుగుతున్నాయి. ఏపీ హోం మంత్రిగా అనిత బాధ్యతలు తీసుకున్న తర్వాత… ఈ సంఘటనలు ఎక్కువయ్యాయని వైసీపీ చెబుతోంది. Vangalapudi Anitha
Also Read: Chandrababu: రేవంత్ తరహాలోనే.. ఏపీ ప్రజలకు పంగనామాలు పెట్టిన బాబు ?
ఈ నేపథ్యంలోనే… ఏపీ హోం మంత్రి అనిత పై వివాదాస్పద పోస్ట్ పెట్టారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని మండిపడ్డారు. ఏపీ హోం మంత్రి అనిత మాటలు కోటలు దాటుతున్న… చేతులు మాత్రం గడప దాటడం లేదని ఫైర్ అయ్యారు. బొల్లి మాటలతో కాలక్షేపం చేయడం కారణంగానే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భయం గుప్పెట్లోకి వెళ్లిందని మండిపడ్డారు. Vangalapudi Anitha
బయటకు వస్తే ఏమవుతుందో తెలియని ఈ దారుణ పరిస్థితిలో ఏపీలో… దీనికి అనిత కారణమని వెల్లడించారు. హత్యలు జరగకుండా చూడటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని చురకలాంటించారు విజయసాయిరెడ్డి. ప్రభుత్వ వైఫల్యం పై కూడా గవర్నర్ విచారణ చేయాలని… వైఫల్యాల కారణంగా ఏపీ హోం మంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. Vangalapudi Anitha