Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో… వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. 175 స్థానాలకు 175 స్థానాలు గెలుస్తామని… ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఊదరగొట్టారు. కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగుదేశం కూటమికి 164 స్థానాలు దక్కాయి. Chandrababu

Jaganmohan Reddy Chandrababu bumper offer

దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు అయింది. ఇటు వైసిపి పార్టీకి నాలుగు ఎంపీ స్థానాలు అలాగే 11 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే దక్కాయి. ఇలాంటి నేపథ్యంలో ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కలేదు. జగన్మోహన్ రెడ్డికి… ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వమని… తాజాగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. Chandrababu

Also Read: Revanth Reddy: భట్టికి షాక్… డిప్యూటీ సీఎం గా అక్బరుద్దీన్ ?

దీనిపై కోర్టును కూడా ఆశ్రయించారు జగన్మోహన్ రెడ్డి. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే…. తాజాగా దీనిపై జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. కడప ఎమ్మెల్యేగా రాజీనామా చేసి.. వచ్చే రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఏదో ఒక దాని నుంచి పోటీ చేసి గెలిస్తే… శాసనమండలిలో ప్రతిపక్ష హోదా ఇస్తామని యనమల ప్రకటించారు. Chandrababu

ఏపీలో త్వరలోనే టీచర్లు, అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ రెండు ఎమ్మెల్సీ లో… ఏదో ఒక స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలని యనమల తెలిపారు. అప్పుడు గెలిస్తే ఖచ్చితంగా.. మండలిలో ప్రతిపక్ష హోదా వస్తుందని ప్రకటించారు. మండలి లో వైసీపీ ఎమ్మెల్సీలు చాలామంది ఉన్నారు. ఈ లెక్కన కచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా వస్తుంది. Chandrababu