Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ శుభారంభం చేసింది. ఇండియా షూటర్ మను భాకర్ కాంస్యం సొంతం చేసుకుంది. పారిస్ ఒలింపిక్స్ విశ్వవేదికపై తొలి పథకం గెలుచుకొని యావత్ భారతదేశాన్ని సంబరాల్లో ముంచింది. ఆదివారం జరిగిన పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ ఫైనల్లో మను భాకర్ మూడవ స్థానాన్ని స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. ఫైనల్ లో మనోభాకర్ 221.7 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచింది. టైటిల్ పోరులో మను భాకర్ అద్భుత ప్రదర్శన చూపింది. Manu Bhaker
Manu Bhaker back ground
ఈ పథకం ద్వారా మను భాకర్ చరిత్రను సృష్టించింది. ఒలింపిక్స్ షూటర్ లో పథకం గెలిచిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. మను భాకర్ హర్యానాకు చెందిన 22 ఏళ్ల అమ్మాయి. ఆమె తండ్రి ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. తల్లి ప్రిన్సిపాల్. మే 2018 కామన్ వెల్త్ గేమ్స్ లో 16 ఏళ్ల వయసులోనే స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది. మను అర్జున అవార్డు గ్రహీత కూడా. ఇప్పుడు భారత్ నుంచి ఈసారి ఒలింపిక్స్ లో తొలి పథకం అందుకోవడంతో ఈమె పేరు మార్మోగిపోతుంది. Manu Bhaker
Also Read: IPL 2025: ఐపీఎల్ లో ఇక కొత్త రూల్స్.. ఏకంగా 6 ప్లేయర్స్ ?
కాగా భారత్ చివరిసారిగా 2012 లండన్ ఒలింపిక్స్ లో షూటింగ్ లో పథకాన్ని గెలుచుకుంది. అప్పుడు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో గగన్ పథకాన్ని గెలుచుకున్నాడు. ఇక ఫిస్టల్ లో 25 మీటర్ల రాపిడ్ ఫైర్ ఫిస్టర్ లో విజయ్ కుమార్ పథకాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత భారత్ మళ్లీ ఇప్పుడే షూటింగ్ పథకాన్ని అందుకుంది. భారత్ నుంచి తొలిసారి కాంస్య పథకాన్ని గెలిచిన మను భాకర్ కు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. Manu Bhaker
ఒలంపిక్స్ లో తొలి పథకం అందించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాంస్యం గెలిచినందుకు సంతోషాన్ని తెలియజేశారు. ఈ పథకం భారతదేశానికి ఎంతో ప్రత్యేకమని ఒలంపిక్స్ లో భారత్ కు షూటింగ్ కేటగిరిలో కాంస్య పథకాన్ని అందించిన తొలి మహిళగా మను భాకర్ అవతరించిందని అన్నారు. ఇది నిజంగా అద్భుతమైన ఘనత అంటూ నరేంద్ర మోడీ పొగిడారు. Manu Bhaker