Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి అంటూ గత కొద్ది రోజులుగా ఓ వార్త మీడియాలో ఎంత వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్,మెహ్రీన్ ఫిర్జాదాని పెళ్లి చేసుకోబోతున్నారని,వీరిద్దరికి జవాన్ సినిమా టైంలోనే ప్రేమ చిగురించిందనే పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ పూకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఎంత మంది క్లారిటీ ఇచ్చినా కూడా ఈ వార్తలు ఆగడం లేదు.
Marriage with that heroine..Sai Dharam Tej gave two conditions
తాజాగా ఈ వార్తపై మెగా హీరో సాయి ధరమ్ తేజ క్లారిటీ ఇచ్చారు. ఆయన తాజాగా ఉష పరిణయం అనే సినిమా ఈవెంట్లో పాల్గొని తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చారు.ఇందులో భాగంగా.. గత కొద్ది రోజుల నుండి ఓ హీరోయిన్ తో నా పెళ్ళంటూ వస్తున్న వార్తలు వస్తున్నాయ్. నేను కూడా చూస్తూనే ఉన్నాను.కానీ అందులో ఎలాంటి నిజం లేదు.(Sai Dharam Tej)
Also Read: Krishna-Vijaya Nirmala: కృష్ణ నిర్మల మధ్య చిచ్చు పెట్టి పెళ్లిని అడ్డుకున్న పెద్దాయన.. ఎవరంటే..?
ప్రస్తుతం నేను సోలో లైఫే సో బెటర్ అని ఉన్నాను. ఇప్పట్లో నాకు పెళ్లి మీద ఎలాంటి ఆలోచన లేదు. పెళ్లికాని ప్రసాద్ లాగే మరి కొద్దిరోజులు ఉందామని అనుకుంటున్నాను. అలాగే నేను పెళ్లి చేసుకునే అమ్మాయికి ఆ రెండు క్వాలిటీస్ మాత్రం కచ్చితంగా ఉండాలి. అదేంటంటే..మొదటగా మా అమ్మకి ఆ అమ్మాయి నచ్చి ఉండాలి.
అలాగే సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉండాలి. ఈ రెండు లక్షణాలు నేను చేసుకోబోయే అమ్మాయికి కచ్చితంగా ఉండాలి అంటూ సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. ఇక డైరెక్టర్ విజయ భాస్కర్ తెరకెక్కిస్తున్న ఉషా పరిణయం మూవీ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన సాయిధరమ్ తేజ్ ఈ విషయాలన్నీ అభిమానులతో పంచుకున్నారు.(Sai Dharam Tej)