Is Vishwak Sen away from social media because of that heroine

Vishwak Sen: యంగ్ హీరోల్లో ఒకరిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విశ్వక్ సేన్ తన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా విశ్వక్ సేన్ సినిమా వస్తుంది అంటే థియేటర్లో మినిమం ఆడుతుంది అనే టాక్ ఉంది.ఈయనతో సినిమా చేసే ఏ నిర్మాత కూడా అప్పుల పాలవరు అనే టాక్ కూడా ఉంది.అయితే అలాంటి ఈయన వెళ్లిపోమాకే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ వంటి రెండు సినిమాలు విశ్వక్ సేన్ కి ఇండస్ట్రీలో మంచి సినీ కెరీర్ ని అందించాయి.

Is Vishwak Sen away from social media because of that heroine

ఆ తర్వాత వచ్చిన హిట్, పాగల్, అశోక వనంలో అర్జున కళ్యాణం,దాస్ కా ధమ్కీ, గామి,గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాలు విశ్వక్సేన్ కెరియర్లో మంచి హిట్లుగా నిలిచాయి. ప్రస్తుతం ఈయన మెకానిక్ రాకీ,లైలా మూవీస్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి.అయితే రీసెంట్గా విశ్వక్ సేన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాని డి ఆక్టివేట్ చేయడంతో సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ చక్కర్లు కొట్టాయి.(Vishwak Sen)

Also Read: NTR: ఎన్టీఆర్ ని మర్చిపోలేకపోతున్న ప్రియురాలు.. ఏం చేసిందంటే.?

ముఖ్యంగా ఓ హీరోయిన్ వల్ల ఈయన సోషల్ మీడియా నుండి తప్పకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా తన మూవీ మెకానిక్ రాకి టీజర్ రిలీజ్ అయింది.అయితే ఈ టీజర్ ఈవెంట్ సమయంలో ఓ హీరోయిన్ వల్లే మీరు ఇంస్టాగ్రామ్ ని డి ఆక్టివేట్ చేశారా అని ప్రశ్న అడగగా..అందులో ఎలాంటి నిజం లేదు.

Is Vishwak Sen away from social media because of that heroine

ఈ ప్రశ్న చాలా రోజుల నుండి వస్తుంది కానీ నేను ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని డిఆక్టివేట్ చేయడానికి కారణం ప్రస్తుతం నాకు 30 ఏళ్ల వయసు రాబోతోంది. అందుకే నేను సోషల్ మీడియాకి,ఫోన్లకి దూరంగా ఉండి సినిమాలపై జీవితంపై ఫోకస్ పెట్టాలని ఫోన్ కి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇంస్టాగ్రామ్ డి ఆక్టివేట్ చేశాను. ఇక సినిమా రిలీజ్ టైం లో ఇంస్టాగ్రామ్ ని ఆక్టివేట్ చేసి మళ్లీ డి ఆక్టివేట్ చేస్తాను అంటూ విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు.(Vishwak Sen)