Revanth Redddy: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా విభిన్నంగా కొనసాగుతున్నాయి. అసలు నేతలు ఏ పార్టీలోకి జంప్ అవుతున్నారో వాళ్లకే తెలియకుండా వెళ్ళిపోతున్నారు. మొన్న గులాబీ పార్టీ అధికారం కోల్పోవడంతో…చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటివరకు పదిమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరో ఆరుగురు ఎమ్మెల్సీలు.. కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. Revanth Redddy
More MLAs ready for ghar wapsi after Gadwal MLA returns to BRS fold
ఇంకా చాలామంది… గులాబీ పార్టీకి చెందిన నాయకులు అలాగే ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. మొత్తం గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు 26 మంది కాంగ్రెస్లో చేరితే… టిఆర్ఎస్ ఎల్పీ విలీనం చేయవచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎల్పీని కూడా.. కల్వకుంట్ల చంద్రశేఖర రావు విలీనం చేసుకున్నారు. Revanth Redddy
Also Read: Pawan Kalyan: పవన్ ఇలాకాలో జగన్ కు షాక్.. ఆ కీలక నేత జంప్ ?
అచ్చం ఇప్పుడు గులాబీ పార్టీని అలాగే దెబ్బ కొట్టాలని రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారు. పదిమందిని… కాంగ్రెస్ పార్టీలో బలవంతంగా లేదా బెదిరించి ఏదో ఒక రూపంలో వారిని చేర్చుకున్నారు. అయితే.. మరి కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అన్న సమయంలోనే… రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. సరిగ్గా 24 రోజుల కిందట.. కాంగ్రెస్ పార్టీలో చేరిన గులాబీ పార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి… మళ్లీ కెసిఆర్ చెంతకు చేరారు. Revanth Redddy
గద్వాల ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనను బలవంతంగా జూపల్లి అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. కానీ… మంగళవారం రోజున.. మళ్లీ గులాబీ పార్టీలో చేరారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్. ఈయనతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, పట్నం మహేందర్ రెడ్డి, కాలే యాదయ్య తిరిగి గులాబీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారట. త్వరలోనే ఈ నలుగురు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గులాబీ పార్టీలో చేరబోతున్నారట. Revanth Redddy