Prabhas: సామాన్య జనాల లాగే సెలబ్రిటీలకు కూడా చాలా రకాల సెంటిమెంట్లు ఉంటాయి. అలా రాజకీయ నాయకులు సినిమా వాళ్లు ఎన్నో సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. రాజకీయ నాయకులు ముహూర్తాలు చూసుకొని ప్రమాణ స్వీకారాలు, మంచి పనులు చేసినట్టే సినిమా వాళ్లు కూడా ముహూర్తం చూసుకొని తమ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో పాటు సినిమా రిలీజ్ డేట్ ని కూడా శుభ ముహూర్తాన ఫిక్స్ చేసుకుంటారు. అలా చాలా మంది సెలబ్రిటీలు ముందు నుండి వర్కౌట్ అయిన సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఉంటారు.
Do you know that color sentiment for Prabhas
ఇక కొంతమందికి ఏదైనా ఉంగరం పెట్టుకుంటే సెంటిమెంట్ ఉంటుంది. మరి కొంతమందికి డ్రెస్ కలర్ ఇక ఇండస్ట్రీలో ఉండే కొంతమంది డైరెక్టర్లకు తమ సినిమాలో తమ అదృష్ట హీరో హీరోయిన్ ని పెడితే కచ్చితంగా సినిమా హిట్ అవుతుంది అని సెంటిమెంట్ ఉంటుంది.ఇలా ఇండస్ట్రీలో ఎన్నో సెంటిమెంట్స్ ఉన్నాయి. అయితే తాజాగా ప్రభాస్ కు సంబంధించి ఆ కలర్ సెంటిమెంట్ ఉంది అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది.(Prabhas)
Also Read: Akkineni Family: అక్కినేని ఇంట్లో పెళ్లి భాజాలు ఒకేసారి మూడు పెళ్లిళ్లు..?
ఇంతకీ అదేంటయ్యా అంటే ప్రభాస్ కి మెరూన్ కలర్ డ్రెస్ వేసుకుంటే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని, అందుకే ఆయన తన ప్రతి సినిమాకి సంబంధించి మెరూన్ కలర్ డ్రెస్ లోనే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయించుకుంటున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే.. ప్రభాస్ హీరోగా చేసిన బాహుబలి 2 సినిమాలో ప్రభాస్ మెరూన్ కలర్ డ్రెస్ లో ఉండే లుక్ ని రిలీజ్ చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.ఆ తర్వాత కల్కి మూవీలో కూడా ప్రభాస్ మెరూన్ కలర్ డ్రెస్ లో రిలీజ్ అయింది.
అయితే మెరూన్ కలర్ డ్రెస్ లో ప్రభాస్ చక్రాన్ని పట్టుకునే దానికి సంబంధించిన పోస్టర్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ మూవీ ఎంత హిట్ అయిందో చెప్పనక్కర్లేదు.అలాగే తాజాగా రాజా సాబ్ కి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇక ఇందులో కూడా ప్రభాస్ మెరూన్ కలర్ కోట్ వేసుకొని ఉన్నారు.దీంతో ప్రభాస్ తన ప్రతి సినిమాకి సంబంధించిన సినిమాలో మెరూన్ కలర్ ని ఎక్కువగా వేసుకుంటున్నారు. ఈయనకు మెరూన్ కలర్ డ్రెస్ సెంటిమెంట్ అయిపోయింది కావచ్చు అని సోషల్ మీడియాలో జనాలు కామెంట్లు పెడుతున్నారు.(Prabhas)