Koratala Shiva challenges ahead of devara release

Koratala Shiva: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిస్తున్న ‘దేవర’ చిత్రం పైన ఇటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొరటాల గత సినిమా ఆచార్య చేసిన డ్యామేజ్ అంతా ఇంత కాదు.. సినిమా ఫ్లాప్ కు మొత్తం కారణం కొరటాల శివ అన్నట్టుగానే పోట్రే జరిగింది. ఆ విధంగా ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని అందుకొని వారందరికీ సమాధానాలు చెప్పాలని కొరటాల శివ భావిస్తున్నాడు. అందుకే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చేయడం విశేషం.

Koratala Shiva challenges ahead of devara release

మొదటి భాగాన్ని అక్టోబర్లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో 2వ భాగానికి సంబంధించిన కొన్ని కీలక సీన్ లను కూడా ఇప్పుడే రూపొందించాడట. అయితే రెండవ భాగం చేయడం కోసం కొరటాల శివకు కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు అన్నట్లుగా ఎన్టీఆర్ సినిమాల లైనప్ ఇప్పుడు ఉందని చెప్పాలి. ‘దేవర’ సినిమా తర్వాత ఎన్టీఆర్ భారీ స్థాయిలో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో ‘వార్ 2’ సినిమా చేయడానికి సిద్ధమవుతున్న ఎన్టీఆర్ అదే సమయంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

Also Read: Game Changer: గేమ్ మొత్తం చేంజ్ చేసిన కియారా..ఫ్యాన్స్ ఫుల్ ఖుషి!!

ఆ విధంగా ఈ రెండు సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ‘దేవర2’ కి సంబంధించిన షూటింగ్ కు డేట్లు ఏ విధంగా కేటాయిస్తాడు అనేది ఇక్కడ అసలు విషయం. అక్టోబర్ తరువాత వార్2 సినిమాకి కొన్ని నెలలు అంకితమైపోతాడు ఎన్టీఆర్.. ఆ తర్వాత ప్రశాంత్ సినిమాకు మరికొన్ని నెలలు కేటాయిస్తాడు.. అలా రెండు సంవత్సరాలు ఈ సినిమాలకు వెళితే మాత్రం ‘దేవర2’ సినిమాను ప్రేక్షకులు చూడడానికి ఎక్కువ సమయం పడుతుందని చెప్పాలి.

దానికి తోడు దేవర మొదటి భాగం సినిమా ఏ విధంగా ఉంటుందో ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. దీన్ని బట్టి కొరటాల శివ కీలకమైన సిచువేషన్ లోనే ఉన్నాడని చెప్పాలి. చాలా వరకు సినిమాలు మొదటి భాగం బాగా హీట్ అయితేనే రెండవ భాగం వరకు వెళుతున్నాయి. లేదంటే మొదటి భాగంతోనే సరిపెట్టుకుంటున్నారు. ఈ సందర్భం లో ఈ సినిమా తో వీరిద్దరూ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. వీరి కాంబో లో గతంలో ‘జనతా గ్యారేజ్’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.