Harish Shankar: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆయన హీరోగా రూపొందుతున్న సినిమాలు ఆగిపోయాయి. ఎన్నికల కంటే ముందు పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒకటి క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా కాగా ఇంకొకటి సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఒజీ’ చిత్రం. ఈ రెండు మాత్రమే కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా కూడా మొదలు పెట్టాడు పవన్. ఆ విధంగా ఈ మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని పవన్ భావించగా అనుకున్న విధంగా ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గెలవడం ఇప్పుడు డిప్యూటీ సీఎం గా మారడంతో ఈ సినిమాలు ఎప్పుడు మొదలవుతాయో అన్న విషయం ఇప్పుడు మరింత అయోమయంగా ఉంది.
Harish Shankar about ustaad bhagath singh movie
ఏదేమైనా పవన్ ఎప్పుడొస్తాడో ఎప్పుడు ఈ సినిమాలు చేస్తాడో అన్న విషయం తెలియదు కానీ ఈ సినిమాల దర్శకులు మాత్రం వారి వారి సినిమాల పట్ల గొప్పలు చెప్పుకుంటున్నారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్న దర్శకుడు హరీష్ శంకర్ ఈ ఆగిపోయిన సినిమా గురించి కొన్ని విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నాడు ఎప్పుడు మొదలై ఎప్పుడు విడుదలవుతుందో తెలియని సినిమా గురించి ఇంతటి డబ్బాలు కొట్టడం అవసరమా అని కొంతమంది నెటిజన్లో కామెంట్లు పెడుతూ ఉండగా వాటికి ఆయన సరైన సమాధానాలు చెప్పారు హరీష్.
Also Read: Lavanya: నా భర్తతో ఆ హీరోయిన్ ఎందుకుంది.. రాజ్ తరుణ్ ఇష్యుపై రచ్చ చేసిన లావణ్య..?
వాస్తవానికి సినిమాను అసలు చేస్తారో లేదో అన్న విషయంపై కూడా క్లారిటీ లేదు. ఏదేమైనా ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులను భారీ స్థాయిలోనే అలరిస్తుందని దర్శకుడు చెప్పడం వారికి కొత్త ఆశలు పుట్టినట్లే అని చెప్పాలి ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాలర్ వేసేలా ఈ సినిమా ఉండబోతుంది అని వారు చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తారు ఎప్పుడు ప్రేక్షకులకు ముందుకు వస్తుంది అనేది త్వరలోనే తేలుతుంది. ప్రస్తుతం పలు రాజకీయ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న పవన్ కళ్యాణ్ ఈ మూడు సినిమాలను ఏ విధంగా ఖాళీ చేసుకుని తిరిగి మొదలు పెడతారో చూడాలి.