Sabitha Indra Reddy: తెలంగాణ ఆడపడుచు చేవెళ్ల నియోజకవర్గ గులాబీ పార్టీ ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డికి గోర అవమానం జరిగింది. తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి.. మాట్లాడిన మాటలకు.. కుంగిపోయిన సబితమ్మ.. ఏడ్చేశారు. ఇప్పుడు ఈ అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివాదంగా మారింది. Sabitha Indra Reddy

Sabitha Indra Reddy Betrayed Me Revanth Reddy

గత వారం పది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత శుక్రవారం బడ్జెట్ను బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అప్పటినుంచి ఇవాల్టి వరకు అసెంబ్లీ సమావేశాలు వేడి వాడిగానే సాగుతున్నాయి. అయితే ఇవాళ… సబితమ్మను తెలంగాణ మంత్రులు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. Sabitha Indra Reddy

Also Read: Peddi Reddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎమ్మెల్యే పదవి రద్దు ?

కాంగ్రెస్ పార్టీలో గెలిచి… గులాబీ పార్టీలో చేరిందని విమర్శలు చేశారు ముఖ్యమంత్రి అలాగే మంత్రులు. ఈ నేపథ్యంలోనే.. సబితాను నమ్ముకుంటే బస్టాండ్ పాలే అవుతారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే రాత్రి ఒక మాట పొద్దున ఒక మాట సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతారని ఆమెను విమర్శించారు. Sabitha Indra Reddy

దీంతో సబితా ఇంద్ర రెడ్డి అసెంబ్లీలో అటు బయట మీడియాతో మాట్లాడేటప్పుడు కన్నీరు పెట్టుకున్నారు. తన వల్ల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తనను.. టార్గెట్ చేస్తున్నాడని… సవిత ఇంద్ర రెడ్డి విమర్శలు చేశారు. అంతేకాదు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను… దహనం చేయాలని గులాబీ పార్టీ పిలుపునిచ్చింది. Sabitha Indra Reddy