Gautam Gambhir: శ్రీలంకతో ఫస్ట్ టీ20 మ్యాచ్…. రియాన్ పరాగ్ తో బౌలింగ్. శ్రీలంక కూడా దీనిని ఊహించి ఉండదు. ఎవరితను అని అనుకునేలోపే మూడు వికెట్లు తీశాడు. రెండు, మూడు టీ20 మ్యాచుల్లోనూ బౌలింగ్ చేశాడు. అంటే పార్ట్ టైం స్పిన్నర్ గా పరాగ్ సేవలు వాడుకోవాలని భావించింది టీమిండియా. మూడవ టీ20 మ్యాచ్ ఆఖరి 2 ఓవర్లలో 9 పరుగులు చేస్తే శ్రీలంక గెలుస్తుంది. అలాంటి సమయంలో ఫాస్ట్ బౌలర్లను కాదని రింకు, సూర్య కుమార్ యాదవ్ బౌలింగ్ చేశారు. Gautam Gambhir
Bowling with the heroes of sixes Gambhir coaching style
పిచ్ స్పిన్నర్ కు సహకరించేదే కావచ్చు….. కానీ ఊహించని రీతిలో ఇద్దరి నుంచి బౌలింగ్ అనేది మాత్రం కంప్లీట్ గా స్ట్రాటజీ. వాటర్ బాయ్ వచ్చి సూర్య కుమార్ యాదవ్ తో మాట్లాడడం…. ప్లాన్ మారిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఇది కేవలం సూర్య ఒక్కడి నిర్ణయం మాత్రమే కాదు. ఎలాంటి సందర్భాల్లో ప్రత్యర్థుల ఊహకు అందకుండా ఎలా ప్రవర్తించాలి అనేది కంప్లీట్ గా స్ట్రాటజీ. దీని వెనుక ఉన్న రీజన్ కోచ్ గౌతమ్ గంభీర్. అగ్రెసివ్ బ్యాటర్ గా… ప్రత్యర్థులకు తలవంచని ఫైటర్ గా మాత్రమే అభిమానులకు తెలిసిన గంభీర్ లోని కోచ్ అతని స్ట్రాటజీలు మొట్టమొదటి సిరీస్ లోనే బయటపడ్డాయి. Gautam Gambhir
Also Read: Paris Olympics: ఒలింపిక్స్ చరిత్రలో సంచలనం.. ఎవరీ సరబ్‌జోత్ సింగ్ ?
స్టైలిష్ బాటర్లను స్పిన్ మాంత్రికులుగా మార్చి ప్రత్యర్థులను ఊహించలేనంతగా దెబ్బ కొట్టాడు గౌతమ్. ఇది కేవలం ఇప్పుడే కాదు ఐపీఎల్లోనూ ఇలాంటివి మనం చాలానే చూసాం. కోల్కత్తా నైట్ రైడర్స్ కు ఆడేవరకు కేవలం స్పిన్నర్ గా మాత్రమే ప్రపంచానికి తెలిసిన సునీల్ నరైన్ ను పించ్ హిట్టర్ గా మార్చి ఓపెనర్ గా చేసి అద్భుతమైన ఫలితాలను రాబట్టి కోల్కత్తానూ ఛాంపియన్ గా నిలబెట్టాడు గౌతమ్ గంభీర్. అచ్చం అలాంటి నిర్ణయమే కోచ్ గా తను వ్యవహరించిన మొట్టమొదటి టీ20 సిరీస్ లోనే అమలుచేసి అద్భుతమైన ఫలితాలను రాబట్టాడు. Gautam Gambhir
టీ20లో బ్యాటింగ్ ఎంత ఇంపార్టెన్సో అవసరమైన సమయాల్లో ఉపయుక్తంగా మారి మ్యాచ్ ను కాపాడుకునే బౌలర్లు కూడా అంతే ఇంపార్టెన్స్. అందుకే టీమ్ లో ప్రతి ఒక్కరికి ఆటూ బౌలింగ్, ఇటు బ్యాటింగ్ అవసరమైనప్పుడు వాడుకునేలా వారికి ఉన్న ప్రతిభను కంప్లీట్ గా వాడుకునేలా శ్రీలంకతో టీ20 సిరీస్ లో ప్రయోగాలు జరిగాయి. ఫలితంగా టీమిండియాకు ఇప్పుడు ముగ్గురు ఉపయుక్తమైన పార్ట్ టైం స్పిన్నర్లు పుట్టుకొచ్చారు. అందుకే ఫ్యాన్స్ రింకు, పరాగ్, సూర్యల కుమార్ బౌలింగ్ ను ఆర్ట్ అని…. గంభీర్ ను ది ఆర్టిస్ట్ అంటూ మీమ్స్ వేస్తున్నారు. Gautam Gambhir