Pawan Kalyan missed the blockbuster movie because

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజంగానే గుండు గీయించుకోవడానికి భయపడి ఆ బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకున్నారా.. ఇంతకీ పవన్ కళ్యాణ్ వద్దనుకున్న సినిమా ఏంటి అంత పెద్ద హిట్టు కొట్టిందా.. అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు కొంతమంది వీరాభిమానులు ఉంటారు.ఇక అభిమానులు వారి హీరోల కొలతల్లో ఏమాత్రం తేడా వచ్చినా కూడా అస్సలు సహించరు. అంతేకాదు డీ గ్లామరస్ లుక్ లేదా ఏదైనా లోపం ఉన్న పాత్రల్లో నటిస్తే అస్సలు అంగీకరించారు.

Pawan Kalyan missed the blockbuster movie because

అయితే ఇలాంటి విషయాన్ని ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ చెబుతూ నా అభిమానులు నేను గుండు కొట్టించుకుంటే ఒప్పుకోరు.అందుకే నేను ఆ పాత్రలో చేయలేదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.ఇక పవన్ కళ్యాణ్ వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీ ఏదో కాదు మురగదాస్ దర్శకత్వంలో గజిని మూవీ. ఈ సినిమా కోసం డైరెక్టర్ మురగదాస్ ఎంతోమంది హీరోలను సంప్రదించినప్పటికీ ఆ పాత్రలో చేయడానికి ఒప్పుకోలేదు.(Pawan Kalyan)

Also Read: Pushpa2: మళ్ళీ మొదటికొచ్చిన పుష్ప పరిస్థితి.. బ్యాడ్ టైం అంతే !!

చివరికి సూర్య చేతికి వచ్చింది. ఇక ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా అవకాశం పవన్ కళ్యాణ్ కి వచ్చిన సమయంలో రిజెక్ట్ చేశారు.అయితే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెబుతూ తమిళ హీరోలు ఎలాంటి పాత్రల్లో నటించినా కూడా వారి అభిమానులు యాక్సెప్ట్ చేస్తారు. సినిమా హిట్ అవుతుంది.

Pawan Kalyan missed the blockbuster movie because

కానీ నేను అలా గుండు గీయించుకొని మతిమరుపు పాత్రలో చేస్తే మాత్రం నా ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. అంతేకాదు మంచి స్క్రిప్ట్ లో నేను నటించడం వల్ల ఫలితం దక్కదు.అందుకే నేను ఆ సినిమాను రిజెక్ట్ చేశాను. టాలీవుడ్ లో హీరో అంటే నీట్ గా హ్యాండ్సమ్ గా కనిపించాలి.కానీ నేను అలా గుండు గీయించుకొని ఆ పాత్రలో చేస్తే నటిస్తే నా అభిమానులు అస్సలు రిసీవ్ చేసుకోరని నేను ఆ సినిమాలో నటించలేదు అంటూ పవన్ క్లారిటీ ఇచ్చారు.(Pawan Kalyan)