Allu Sirish: అల్లు శిరీష్ హీరోగా చేస్తున్న బడ్డీ మూవీ తాజాగా అంటే ఆగస్టు 2న విడుదలైంది. అయితే ఈ సినిమా షూటింగ్ గత ఏడాది అయిపోయినప్పటికీ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలని సెట్ చేయడం కోసం ఇన్ని రోజులు పట్టిందని, అందుకే ఈ సినిమాని ఆగస్టులో రిలీజ్ చేశామని ఆలోచించి చెప్పారు. ఇక అల్లు శిరీష్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమా నైనా హిట్ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా మీదే ఆయన సినీ కెరీర్ ఆధారపడి ఉంది.
Allu Sirish sensational comments on mega family
అయితే అలాంటి ఈ సినిమాని బాగా ప్రమోట్ చేశారు శిరీష్.. ఇందులో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొని వ్యక్తిగత, సినీ విషయాలను పంచుకున్నారు. అయితే ఏపీలో ఎన్నికలు జరిగినప్పటినుండి అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ తన స్నేహితుడికి సపోర్ట్ చేయడంతో ఈ గొడవలు బయటపడ్డాయి. అయితే అల్లు మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు వస్తున్నాయి అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అల్లు శిరీష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. (Allu Sirish)
Also Read: Kajal Aggarwal: ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఇంటికి కోడలుగా వెళ్లాలనుకున్న కాజల్..కానీ..?
ఇక మెగా ఫ్యామిలీ గురించి అల్లు శిరీష్ మాట్లాడుతూ.. చిరంజీవి గారి గురించి ఎవరు ఎన్ని నెగిటివ్ గా మాట్లాడిన కూడా ఆయన మాత్రం పాజిటివ్ గానే ఉంటారు. ఎంతమంది ద్వేషించిన కూడా ఆయన మాత్రం వారిని ప్రేమిస్తూనే ఉంటారు.ఇక పవన్ కళ్యాణ్ లో చెప్పలేనంత మానసిక ధైర్యం ఉంటుంది.ఆయనకున్న ధైర్యం ఎవరికి లేదు. ఇక మా నాన్న మాత్రం ప్రతి పనిని చాలా వేగంగా చేస్తూ ఉంటారు. ఒక రకంగా ఆయన రోబోలా పని చేస్తారు.
అలాగే మా అన్నయ్య అల్లు అర్జున్ ఎప్పటికీ నాకు ఒక ఫేవరెట్ బడ్డి. మా ఇద్దరి మధ్య చిన్నప్పటి నుండి ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి.. అంటూ అల్లు శిరీష్ చెప్పుకొచ్చారు. అయితే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలి కి మధ్య గొడవలు ఉన్నాయి అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో మెగా ఫ్యామిలీ గురించి శిరీష్ పాజిటివ్ గా స్పందించడంతో వీరి మధ్య అలాంటి గొడవలు ఏవి లేవు అని, బయట జరిగేదంతా పుకార్లే అని భావిస్తున్నారు.(Allu Sirish)