Mrunal Thakur: ‘సీతారామం’ సినిమాతో సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. స్టార్ గా ముద్ర వేసుకున్నాక ఆమెకు తెలుగులో ఒక్కసారిగా వరుస అవకాశాలు వచ్చాయి. ఆ విధంగా ఇప్పుడు పలు సినిమాలలో నటిస్తున్న మృణాల్ కు ‘సీతారామం’ చిత్రం తర్వాత విజయం పెద్దగా అందుకోలేదని చెప్పాలి. ఆమె చేసిన వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ఆమె పాపులారిటీ మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. ఫైనల్ గా ఇప్పుడు మరొకసారి తనకు హిట్ ఇచ్చిన దర్శకుడుతో సినిమా చేయడానికి సిద్ధమవుతుంది.
Mrunal thakur career beginning issue
అలా ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుంది మృణాల్. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ పిరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్న విషయం తెలిసిందే. తొందరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతుండగా పలువురు హీరోయిన్లను పరిశీలించగా ఫైనల్ గా మృణాల్ ను ఎంపిక చేసుకున్నాడట. ఆ విధంగా హిట్ సెంటిమెంటును ఫాలో అవుతూ ముందుకు వెళ్లిన హను ఈ సినిమాతో విజయాన్ని అందుకుంటాడా అనేది చూడాలి.
Also Read: Raviteja: వరుస ఫ్లాప్ లు.. అయినా తగ్గని రవితేజ!!
ఇకపోతే ఆమె తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ ప్రేక్షకులతో పంచుకుంది. కెరియర్ మొదట్లో ఏదైనా పాత్ర కోసం ఎంచుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల వారిని తప్పిస్తే చాలామంది బాధపడి ఊరుకుంటారు. కానీ మృణాల్ మాత్రం ఆ విధంగా చేయలేదని చెప్పుకొచ్చింది. గొడవపరి మరి ఆ పాత్రను లాక్కుందట. ‘పూజా మేరీ జాన్’ అనే సినిమా కోసం ఆమెను ప్రధాన పాత్ర కోసం ఎంచుకోగా వేరే వారిని ఆ సినిమాలో పెట్టాలని భావించినప్పుడు తనను తీసేస్తున్నారు అని తెలిసినప్పుడు ఆమె దానికి అస్సలు ఒప్పుకోలేదట. నా కెరియర్ లో ఎక్కువసార్లు ఆడిషన్స్ చేసిన సినిమా అదేనని, ఆ పాత్రతో ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యారని ఆ పాత్ర తనకే కావాలని సినిమా నిర్మాత తో గొడవ పడిందట. చివరికి ఆ పాత్ర ఆమె చేసిందని చెప్పకు వచ్చింది. ఈ ఏడాది ఆ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రం గురించి ఆమె ప్రేక్షకులకు వివరించింది.