Anil ravipudi venkatesh movie shooting

Anil Ravipudi: విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో “వెంకీ 76” గా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం దిల్ రాజు భారీ బడ్జెట్‌ కేటాయించగా వరుస విజయాలు సాధించిన అనిల్ రావిపూడి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ మూవీని అందుకోవాలని భావిస్తున్నాడు. వెంకీ, అనిల్ రావిపూడి కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 సినిమాలు వీరి కాంబో లో వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలుగా వచ్చిన ఇవి సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ సారి చేయబోయే సినిమా కాస్త వెరైటీ గా ఉండాలని చెప్పి క్రైమ్ కామెడీ కథాంశంతో సాగే సినిమాను అనిల్ రావిపూడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Anil ravipudi venkatesh movie shooting

ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. సాయికుమార్ కీలక పాత్రలో నటించనున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ శేరావేగంగా జరగబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా యొక్క తొలి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో పూర్తయింది. రెండో షెడ్యూల్‌ పొలాచ్చిలో ప్లాన్ చేస్తున్నారు. ఆగస్ట్ 9 నుంచి పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకోబోతుండగా ఈ సినిమా షూటింగ్‌ని అతి తక్కువ సమయంలో పూర్తి చేసి విడుదల చేయాలని అనిల్ రావిపూడి భావిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: Raviteja: రవితేజ రొమాన్స్.. శృతి మించిపోతుందా!!

ఇక ఈ చిత్రానికి సంక్రాంతికి వస్తున్నాము అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. దిల్ రాజు, అనిల్ రావిపూడి కలిసి చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఈ సినిమా కూడా మరో కమర్షియల్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. మరి వీరి కాంబో లో రాబోతున్న మరో హిట్ సినిమా ఇది అవుతుందా అనేది చూడాలి. ఇక విక్టరీ వెంకటేష్ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. మొదటి సీజన్ ఆకట్టుకోగా ఇప్పుడు రెండో సీజన్ విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. “రానా నాయుడు” సెకండ్ సీజన్ కోసం జనాలు మరింతగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ లో రానా, వెంకటేష్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. ఈ ఏడాది సైంధవ్‌తో వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు రాగా అది బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలిపోయింది. కాగా అనిల్ రావిపూడితో కలిసి చేయబోయే సినిమాపై వెంకటేష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.