Ram Pothineni: టాలీవుడ్ ఉస్తాద్ రామ్ పోతినేని హీరో గా చేసిన పాన్-ఇండియా సినిమా ‘స్కంద’ బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో “డబుల్ స్మార్ట్” హిట్ కొట్టాలని అయన భావిస్తున్నాడు. ఆగస్ట్ 15 న ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే ఈ ఎనర్జిటిక్ హీరో మరో ప్రాజెక్ట్‌కి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. “రారా కృష్ణయ్య” ఫేమ్ మహేష్ బాబు.పి దర్శకత్వంలో రామ్ పోతినేని తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఏడాది మిస్టర్ శెట్టి పోలిశెట్టి సినిమాతో హిట్ సంపాదించుకున్న దర్శకుడు మహేష్ ఇప్పుడు రామ్‌తో కలిసి ఓ డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది.
Ram pothineni multistarrer with hero
రామ్ ఇప్పటివరకు నటించని సరికొత్త కథాంశంతో ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. ఈ సినిమాలో ఓ సీనియర్ స్టార్ హీరో కీలక పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. కథలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర అని ఇది మల్టీస్టారర్ సినిమా అని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే రామ్ అభిమానులు ఇది మల్టీ స్టారర్ సినిమా అనగానే భయపడుతున్నారు. రామ్ గతంలో విక్టరీ వెంకటేష్‌తో కలిసి మల్టీ స్టారర్ సినిమా ‘మసాలా’ చేశాడు. ఇది బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు. అయితే దశాబ్దం తర్వాత మరో హీరోతో ఆయన స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే ఆ హీరో ఎవరనేది త్వరలోనే వెల్లడించనుంది.
Also Read: Surya Kumar Yadav: ఐపీఎల్ 2025 లో సూర్యకు 100 కోట్లు ఆఫర్ ?
రామ్ పోతినేని తదుపరి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభించే అవకాశం ఉంది. అదే క్రమంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా రామ్ ఓ సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ విషయంపై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
అయితే రామ్ దృష్టి ఇప్పుడు “ఇస్మార్ట్ శంకర్” సీక్వెల్ పైనే ఉంది. ఈ సినిమా హిట్ కొట్టి సంచలనం సృష్టించాలని రామ్ అభిమానులు భావిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మణి శర్మ సంగీతం సమకూర్చారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషన్ మెటీరియల్‌లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.